Video Viral: కుక్క పిల్లలకు గేదె పాలు పడుతున్న మహిళ.. మనసు దోచుకుంటున్న వీడియో.. సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియా (Social Media) రకరకాల వీడియోలతో నిండిపోయింది. మనుషులు, జంతువులకు సంబంధించిన వీడియోలు అనేకం ఉన్నాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అన్ని రకాల వీడియోలను చూడవచ్చు. ఫన్నీ వీడియోలు...

Video Viral: కుక్క పిల్లలకు గేదె పాలు పడుతున్న మహిళ.. మనసు దోచుకుంటున్న వీడియో.. సోషల్ మీడియాలో వైరల్
Dogs Drinking Milk

Updated on: Aug 23, 2022 | 7:19 AM

సోషల్ మీడియా (Social Media) రకరకాల వీడియోలతో నిండిపోయింది. మనుషులు, జంతువులకు సంబంధించిన వీడియోలు అనేకం ఉన్నాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అన్ని రకాల వీడియోలను చూడవచ్చు. ఫన్నీ వీడియోలు (Videos) నవ్విస్తే, కొన్ని వీడియోలు భావోద్వేగానికి గురి చేస్తాయి. మరికొన్ని మాత్రం ఆశ్చర్యపరుస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో జంతువులతో పాటు మనుషులకు సంబంధించింది. ఈ వీడియోలో ఒక మహిళ రెండు చిన్న కుక్కలకు గేదె పాలు తాగించడాన్ని చూడవచ్చు. నిజానికి తల్లి తన పిల్లలకు ఆకలిగా ఉన్నప్పుడు పాలు తాగిస్తుంది. ఈ వీడియోలో కూడా ఒక మహిళ ఆకలితో ఉన్న కుక్కలకు గేదె పాలు ఇస్తోంది. ఇదొక అద్భుతమైన దృశ్యం. ఆ సమయంలో ఆమె చాలా సంతోషంగా ఉండటాన్ని గమనించవచ్చు. ఈ వీడియో ప్రజల హృదయాలను మెలిపెడుతోంది. కొంతమంది ఈ వీడియో చూసిన తర్వాత భావోద్వేగానికి గురవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ అద్భుతమైన, హృదయాన్ని హత్తుకునే వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ‘ఆకలితో ఉన్నప్పుడు తల్లి మాత్రమే మనసు పెట్టి ఆలోచిస్తుంది.’ అనే శీర్షికతో ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. 18 సెకన్ల నిడివి కలిగిన వీడియోకు ఇప్పటివరకు 20 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. వందలాది మంది వీడియోను లైక్ చేస్తున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. వీడియో చూసిన తర్వాత నెటిజన్లు వివిధ రకాలుగా రియాక్షన్లు ఇస్తున్నారు. అందరి హృదయాలను గెలుచుకునే ఇలాంటి వీడియోలు చాలా అరుదుగా కనిపిస్తాయని కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..