Viral: కడుపునొప్పితో అస్పత్రికొచ్చిన మహిళ.. CT స్కాన్ చేయగా

క్యాన్సర్ ఆపరేషన్ చేయించుకున్న ఓ మహిళకు.. శస్త్రచికిత్స అనంతరం తీవ్ర కడుపునొప్పి రావడం మొదలైంది. ఎన్నో మందులు వాడింది.. అయినా లాభం లేకపోయింది.. చివరికి CT స్కాన్ చేయించగా..

Viral: కడుపునొప్పితో అస్పత్రికొచ్చిన మహిళ.. CT స్కాన్ చేయగా
Viral
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 03, 2024 | 11:30 AM

గ్వాలియర్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. రెండేళ్ల క్రితం క్యాన్సర్ చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లిన ఓ మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యులు.. ఆమె కడుపులో కత్తెరను వదిలేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఆపరేషన్ అనంతరం తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న ఆమె కడుపులో నుంచి రెండేళ్ల తర్వాత కత్తెరను తొలగించారు.

తాజా సమాచారం ప్రకారం.. సదరు మహిళ 2 సంవత్సరాల క్రితం గ్వాలియర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకుంది. ఆ సమయంలో శస్త్రచికిత్స చేసిన డాక్టర్లు.. ఆమె కడుపులో కత్తెరను వదిలేశారు. అనంతరం కడుపునొప్పితో బాధపడిన సదరు మహిళ.. ఇటీవల సిటి స్కాన్‌ చేయించుకోగా.. ఆమె కడుపులో కత్తెర కనిపించడం చూసి భింద్ జిల్లా ఆసుపత్రి వైద్యులు, రోగి కుటుంబ సభ్యులు దెబ్బకు షాక్ అయ్యారు. దీంతో అసలు విషయం బయటపడింది.

రెండేళ్ల క్రితం ఆ మహిళకు గ్వాలియర్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగింది. ఈ ఆపరేషన్‌ సమయంలో వైద్యులు ఆమె కడుపులో కత్తెరను ఉంచేసినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భింద్ జిల్లాకు చెందిన ఆ మహిళ, ఫిబ్రవరి 20, 2022న గ్వాలియర్‌లోని కమలా హాస్పిటల్‌లో కడుపు క్యాన్సర్‌కు శస్త్రచికిత్స చేయించుకుంది. ఆపరేషన్ సమయంలో డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి మహిళ కడుపులో కత్తెరను వదిలేశారు. ఈ విషయం ఆ మహిళకు తెలియలేదు. అయితే గత కొద్ది రోజులుగా ఆ మహిళకు కడుపునొప్పి రావడం, మందులు వాడుతున్నా నొప్పి తగ్గకపోవడంతో వైద్యులు CT స్కాన్ చేశారు. దీంతో ఆ కత్తెర విషయం బయటకొచ్చింది. కడుపులో కత్తెర ఒక మహిళకు ప్రాణాంతకం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యుడిపై కోర్టుకెక్కుతామని బాధితురాలు వాపోయింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

సూపర్ నేచురల్స్‎తో కుర్ర హీరోలు..రియలిస్టిక్‌ కథలతో స్టార్ హీరోలు
సూపర్ నేచురల్స్‎తో కుర్ర హీరోలు..రియలిస్టిక్‌ కథలతో స్టార్ హీరోలు
శాంసన్, సూర్య ఔట్.. లక్కీ ఛాన్స్ పట్టేసిన ఫ్యూచర్ స్టార్?
శాంసన్, సూర్య ఔట్.. లక్కీ ఛాన్స్ పట్టేసిన ఫ్యూచర్ స్టార్?
ఆ విషయంలో టాలీవుడ్‌ను ఫాలో అవుతున్న బాలీవుడ్.. ఎందులోనో తెలుసుకోం
ఆ విషయంలో టాలీవుడ్‌ను ఫాలో అవుతున్న బాలీవుడ్.. ఎందులోనో తెలుసుకోం
'మీ క్లారిటీతో మరింత దిగజారారు'.. 90 గంటల పనిపై దీపిక మరో పోస్ట్
'మీ క్లారిటీతో మరింత దిగజారారు'.. 90 గంటల పనిపై దీపిక మరో పోస్ట్
బాలయ్యతో సినిమా కోసం హరీష్ ప్రయత్నాలు
బాలయ్యతో సినిమా కోసం హరీష్ ప్రయత్నాలు
నేడు టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం.. కీలక తీర్మానాలు..!
నేడు టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం.. కీలక తీర్మానాలు..!
కొత్త ఇల్లు కొన్న హీరోయిన్.. ఏకంగా రూ.100 కోట్లు.
కొత్త ఇల్లు కొన్న హీరోయిన్.. ఏకంగా రూ.100 కోట్లు.
ఊరికి ఇలాంటి వ్యక్తి ఒక్కరున్నా చాలు.. రూ.9లక్షలతో స్కూల్ కట్టాడు
ఊరికి ఇలాంటి వ్యక్తి ఒక్కరున్నా చాలు.. రూ.9లక్షలతో స్కూల్ కట్టాడు
దెయ్యాలను దత్తత తీసుకుంటున్న నిర్మాత
దెయ్యాలను దత్తత తీసుకుంటున్న నిర్మాత
ఓరీ దేవుడో.. ఈ జాలరీ పంట పండింది.. ఒకే ఒక్క చేప ఖరీదు రూ.11కోట్లు
ఓరీ దేవుడో.. ఈ జాలరీ పంట పండింది.. ఒకే ఒక్క చేప ఖరీదు రూ.11కోట్లు