AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Photo: ఈ ఫోటోలో ఉన్న ఇద్దరూ తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్.. ఎవరో గుర్తించారా..?

ఇంటర్నెట్.. ఇప్పుడు దేశంలోని ప్రతి మూలకు విస్తరించింది. సెలబ్రిటీలు, స్పోర్ట్ స్టార్స్, పొలిటికల్ లీడర్స్.. తమ ఫ్యాన్స్ ను, ఫాలోవర్స్ ను రీచ్ అయ్యేందుకు ఇంటర్నెట్ బాగా ఉపయోగపడుతుంది.

Trending Photo: ఈ ఫోటోలో ఉన్న ఇద్దరూ తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్.. ఎవరో గుర్తించారా..?
Trending Photo
Ram Naramaneni
|

Updated on: Feb 02, 2023 | 8:18 PM

Share

ప్రజంట్ సోషల్ మీడియా ట్రెండ్ ఎలా నడుస్తుందో అందరికీ తెలిసిందే. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇప్పుడు అందరికీ సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉన్నాయి. ఈ క్రమంలోనే.. సినిమా స్టార్ట్స్,  పలువురు రాజకీయ నాయకులు, స్పోర్ట్ స్టార్స్ తమ అభిమానులకు, అనుచరులకు దగ్గరగా ఉండేందుకు ఈ సోషల్ మీడియా బాగా యూజ్ అవుతుంది. రాజకీయ నాయకుల విషయానికి వస్తే… తాము చేసే డెవలప్‌‌మెంట్ వర్క్స్,  సోషల్ సర్వీసెస్‌ను జనాల్లోకి తీసుకెళ్లేందుకు, తమ ఆలోచలను తెలియజేసేందుకు.. ట్విట్టర్, ఇన్ స్టా, ఫేస్ బుక్ వంటి.. ఫ్లాట్ ఫామ్స్ బాగా యూజ్ అవుతున్నాయి. అంతే కాదండోయ్.. వైరి పక్షాలను తిట్టేందుకు, కౌంటర్ల వేసేందుకు కూడా చాలామంది సోషల్ మీడియాను యూజ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో పలువురు పొలిటికల్ లీడర్ల.. చిన్ననాటి ఫోటోలను ట్రెండ్ వైరల్ చేస్తున్నారు అభిమానులు. సదరు ఫోటోలలో ఆయా లీడర్స్‌ను చూసిన కొందరు నెటిజన్స్.. వారు ఇప్పుడు ఫలానా సెలబ్రిటీ అంటే అస్సలు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు.  ఈ క్రమంలో ఓ ఫోటో ప్రజంట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అందులోని ఇద్దరు వ్యక్తులు.. ఇప్పుడు తెలుగు స్టేట్స్‌లో పవర్ఫుల్ లీడర్స్. ఏంటి కనిపెట్టారా..? అయ్యో ఇంకా లేదా..?. ఇక మేమే రివీల్ చేస్తాం లేండి.

ఆ ఫోటోలో ఉంది.. వెఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆయన సోదరి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. అవునండీ..! చాలామంది వారికి కనిపెట్టలేకపోయారు. ప్రస్తుతం జగన్, షర్మిల చిన్నతనంలో దిగిన ఫోటో ఇంటర్నెట్ వేదికగా ట్రెండ్ అవుతోంది.

Jagan Sharmila

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.