Viral Video: మీరు ధరించే దుస్తులు కూడా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతాయని తెలుసా? ఈ వీడియోనే సాక్ష్యం

|

Apr 27, 2024 | 2:06 PM

రోడ్డు ప్రమాదాలు జరగడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో డ్రైవర్‌ నిర్లక్ష్యం ఉంటే మరోసారి ఎదుటి వారి తప్పు ఉంటుంది. ఏది ఏమైనా రోడ్డు ప్రమాదాల వల్ల అపారమైన నష్టం జరుగుతుంది. అందుకే ప్రభుత్వాలు, పోలీసులు ఎప్పటికప్పుడు రోడ్డు భద్రతకు సంబంధించి ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తూనే ఉంటారు...

Viral Video: మీరు ధరించే దుస్తులు కూడా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతాయని తెలుసా? ఈ వీడియోనే సాక్ష్యం
Viral Video
Follow us on

రోడ్డు ప్రమాదాలు జరగడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో డ్రైవర్‌ నిర్లక్ష్యం ఉంటే మరోసారి ఎదుటి వారి తప్పు ఉంటుంది. ఏది ఏమైనా రోడ్డు ప్రమాదాల వల్ల అపారమైన నష్టం జరుగుతుంది. అందుకే ప్రభుత్వాలు, పోలీసులు ఎప్పటికప్పుడు రోడ్డు భద్రతకు సంబంధించి ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.

అయితే రోడ్డు ప్రమాదాలు జరగడానికి మీరు ధరించే దుస్తులు కూడా కారణమవుతాయని మీకు తెలుసా.? రోడ్డు ప్రమాదానికి ధరించే డ్రస్‌ ఎలా కారణమవుతుందని ఆలోచిస్తున్నారు కదూ! అయితే తాజాగా జరిగిన ఓ సంఘటన దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. సైబరాబాద్ ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారులు ఫేస్‌బుక్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఇది నిజమేనని కచ్చితంగా చెప్తారు.

ఇంతకీ విషయం ఏంటంటే రాత్రి పూట బ్లాక్‌ కలర్‌ డ్రస్‌లను ధరించడం వల్ల ప్రమాదాలు ఎలా జరుగుతాయో వివరిస్తూ రూపొందించిన వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో ఓ యువకుడు బ్లాక్‌ టీ షర్ట్‌ ధరించి రోడ్డు దాటుతుండా అటుగా వచ్చిన కారు ఢీకొట్టింది. అందుకే రాత్రి పూట బైక్‌, సైకిల్ లేదా నడుచుకుంటూ వెళ్లే వారు యల్లో, వైట్‌, గ్రీన్‌ వంటి కలర్స్‌ డ్రస్‌లను ధరించాలని పోలీస్‌ అధికారి తెలిపారు. లేదా రిఫ్లక్టివ్‌ జాకెట్లను ధరించాలని సూచించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..