Viral: పోలీస్ పెట్రోలింగ్ కారు కిందకు దూరిన మొసలి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Viral: రోడ్డుపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు తయారు చేసిన స్పీడ్ బ్రేకర్‌ను మనందరం చూసే ఉంటాం. అయితే వాహనానికి మొసలి స్పీడ్ బ్రేకర్‌గా..

Viral: పోలీస్ పెట్రోలింగ్ కారు కిందకు దూరిన మొసలి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Crocodile
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 24, 2022 | 8:48 AM

Viral: రోడ్డుపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు తయారు చేసిన స్పీడ్ బ్రేకర్‌ను మనందరం చూసే ఉంటాం. అయితే వాహనానికి మొసలి స్పీడ్ బ్రేకర్‌గా మారడం ఎప్పుడైనా చూశారా? చూడకపోతే ఇప్పుడు చూసేయండి. ఓ మొసలి ఏకంగా పోలీస్ పెట్రోలింగ్ కారుకే అడ్డంగా వెళ్లింది. వెళ్లడమే కాదు.. కారు మధ్యలోకి దూరి రెండు చక్రాల మధ్య ఇరుక్కుపోయింది.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఫ్లోరిడాలోని లీస్‌బర్గ్ పోలీసులు పెట్రోలింగ్ కారులో ప్రయాణిస్తున్నారు. ఇంతలో ఓ భారీ మొసలి రోడ్డు అవతలి వైపు నుంచి దూసుకువచ్చింది. పెట్రోలింగ్ కారు కిందకు దూరింది. అయితే, భారీ మొసలి కావడంతో కారు రెండు చక్రాల మధ్య ఇరుక్కుపోయింది. ఏమైందో తెలియని పోలీసులు.. కిందకు దిగి చూడగా షాక్ అయ్యారు. ఆ మొసలిని చూసి తొలుత భయపడినా.. ఆ తరువాత కిందకు దిగి దానిని సేవ్ చేశారు. కాగా, పోలీస్ పెట్రోలింగ్ కారు కింద మొసలి చిక్కుకున్న ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. మొసలికి ఏం కాలేదని, సురక్షితంగా అది బయటపడిందని ఫ్లోరిడా అధికారులు చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..