Viral Video: జోరువానలోనూ తగ్గేదేలే.. టర్పలిన్ కప్పుకుని మరీ రచ్చ చేశారుగా..!

Viral Video: పెళ్లి రోజు వర్షం పడితే.. పరమ చిరాకుగా ఉంటుంది. సాధారణంగా పెళ్లంటే ఆ దంపతులతో పాటు.. వారి కుటుంబాలు కూడా భారీ ప్లాన్స్ వేసుకుంటారు.

Viral Video: జోరువానలోనూ తగ్గేదేలే.. టర్పలిన్ కప్పుకుని మరీ రచ్చ చేశారుగా..!
Baraath
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 24, 2022 | 7:48 AM

Viral Video: పెళ్లి రోజు వర్షం పడితే.. పరమ చిరాకుగా ఉంటుంది. సాధారణంగా పెళ్లంటే ఆ దంపతులతో పాటు.. వారి కుటుంబాలు కూడా భారీ ప్లాన్స్ వేసుకుంటారు. పెళ్లికి నెల రోజుల ముందు నుంచే అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. అలాంటి సమయంలో వర్షం వచ్చి ప్లాన్స్ అంతా పాడు చేస్తే చాలా డిసప్పాయింట్ అవుతారు. వర్షం కారణంగా తాము ముందుగా వేసుకున్న ప్రణాళికలన్నింటినీ రద్దు చేసుకోవాల్సి వస్తుంది. అయితే, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం.. వర్షం వచ్చినా తగ్గేదే లే అంటూ రచ్చ రంబోలా చేసింది ఓ పెళ్లి బృందం. ఆ వీడియో ఇప్పుడు నెటిజన్లను ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటుంది.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఓ పెళ్లి బృందం.. బరాత్ తీస్తుండగా భారీ వర్షం వచ్చింది. అయినప్పటికీ వారు తగ్గలేదు. ఓ భారీ టర్పలిన్ పట్టాను కప్పుకుని మరీ బరాత్ తీశారు. కొందరైతే.. డీజే ముందు వర్షంలో చిందులేశారు. జోరువానలో తగ్గేదే లే అంటూ.. రోడ్డు వెంట బరాత్ తీశారు. కాగా, వర్షంలో బరాత్ డ్యాన్స్‌ను కొందరు ఫోన్‌లో వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన స్టైల్‌లో స్పందిస్తున్నారు. ఇది భారతదేశంలో మాత్రమే సాధ్యం అని కామెంట్స్ పెడుతున్నారు. భారతీయులు గొప్ప సృష్టికర్తలు అని మరికొందరు పేర్కొంటున్నారు. మరెందుకు ఆలస్యం ఈ ఫన్నీ వీడియోపై ఓ లుక్కేసుకోండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..