Viral Video: వాకింగ్ ట్రాక్‌పై నల్లటి ఆకారం.. దగ్గరకు వెళ్లి చూడగా సడన్ షాక్.. వైరల్ వీడియో.!

అది రాత్రివేళ. చుట్టూ చిమ్మచీకటి.. రోడ్డు ప్రక్కనే ఉన్న వాకింగ్ ట్రాక్‌ మీద ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తున్నారు. అసలే చీకటి.. ఆపై రోడ్డు మీద రాయిరప్పా..

Viral Video: వాకింగ్ ట్రాక్‌పై నల్లటి ఆకారం.. దగ్గరకు వెళ్లి చూడగా సడన్ షాక్.. వైరల్ వీడియో.!
Crocodile

Edited By:

Updated on: Oct 28, 2021 | 7:52 PM

అది రాత్రివేళ. చుట్టూ చిమ్మచీకటి.. రోడ్డు ప్రక్కనే ఉన్న వాకింగ్ ట్రాక్‌ మీద ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తున్నారు. అసలే చీకటి.. ఆపై రోడ్డు మీద రాయిరప్పా ఎక్కడుందో కూడా వారికి కనిపించట్లేదు. బైక్ కాంతి తక్కువగా ఉండటంతో ఒక్కసారిగా బైక్ ఇంజిన్‌ను రెయిజ్ చేశారు. దానితో ఆ లైట్ కాంతిలో వారికి ట్రాక్‌పై ఏదో నల్లటి ఆకారం కనిపించింది. ఏంటా అని దగ్గరకు వెళ్లి చూడగా.. అదొక పెద్ద మొసలి. ఎక్కడో కాదు ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

గుంటూరు జిల్లాలో మొసలి కలకలం రేపింది. పిడుగురాళ్లలో ఓ మొసలి జనసంచారం ఉండే ప్రదేశంలో ప్రత్యక్షమైంది. మొసలిని చూసిన స్థానికులు హడలిపోయారు. పిడుగురాళ్లలోని వాటర్ ట్యాంక్ సమీపంలో గల పెదచెరువులో సంచరిస్తున్న మొసలి.. చెరువు చుట్టూ ఏర్పాటు చేసిన వాకింగ్‌ ట్రాక్‌పైకి వచ్చి చేరింది. చీకట్లో రోడ్డు పక్కన మాటువేసి ఉన్న మొసలిని స్థానికులు గుర్తించారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. చెరువులో సంచరిస్తున్న మొసళ్లను బంధించి వేరే ప్రాంతానికి తరలించాలని స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు. కాగా, ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి చదవండి:

Viral Video: చెరువులో ఈత కొడుతున్న వ్యక్తి.. అంతలో మొసలి మెరుపు దాడి.. చివర్లో ట్విస్ట్ అదుర్స్.!

Viral: సరదాగా 4 గంటలు పబ్‌లో గడిపారు.. మద్యం సేవించారు.. చివరిగా బిల్లు చూసి నోరెళ్లబెట్టారు!

Garuda Puranam: ఈ 3 అలవాట్లు వెంటనే మానేయాలి.. లేదంటే కష్టాలు తప్పవు.!