COVID Vaccination: దేశంలో మందకొడిగా మెుదలైన బూస్టర్ డోస్ ప్రక్రియ.. దీనికి కారణం ఇదేనా..?

COVID Vaccination: కరోనా కట్టడిలో భాగంగా భారత్ దేశంలో 18 ఏళ్లకు పైబడిన అందరికీ ప్రికాషినరీ డోస్(precaution dose) అందించాలని నిర్ణయించింది. ఏప్రిల్ 10 నుంచి వీటిని అందించటం ప్రారంభించింది. కానీ ఈ ప్రక్రియ మందకొడిగా సాగడానికి కారణమేమిటంటే..

COVID Vaccination: దేశంలో మందకొడిగా మెుదలైన బూస్టర్ డోస్ ప్రక్రియ.. దీనికి కారణం ఇదేనా..?
Vaccine
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Apr 11, 2022 | 4:53 PM

COVID Vaccination: కరోనా కట్టడిలో భాగంగా భారత్ దేశంలో 18 ఏళ్లకు పైబడిన అందరికీ ప్రికాషినరీ డోస్(precaution dose) అందించాలని నిర్ణయించింది. ఏప్రిల్ 10 నుంచి వీటిని అందించటం ప్రారంభించింది. మెుదటి రోజు కేవలం 9,674 మంది మాత్రమే దీనిని తీసుకున్నారు. వీటిలో కలుపుకుంటే ఇప్పటి వరకూ దేశంలో 185.74 కోట్ల డోసుల వ్యాక్సిన్స్ అందరికీ అందించటం జరిగిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో క్రమంగా కరోనా కేసులు(Corona cases) మళ్లీ పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశ రాజధాని దిల్లీలో సైతం ఈ బూస్టర్ డోస్ తీసుకోవటం మందకొడిగా సాగుతోందని తెలుస్తోంది. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగంలోని కొన్ని ఆసుపత్రులు సైతం ఈ కరోనా బూస్టర్ డోస్ అందిస్తున్నారు. దీనిని ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వాలు పెద్దఎత్తున క్యాంపెన్స్ నిర్వహిస్తున్నాయి.

అసలు మూడోసారి కరోనా వ్యాక్సిన్ తీసుకోవటం అవసరమా అనే అనుమానంలో దేశంలోని చాలా మంది ఉన్నారని వైద్య నిపుణులు అంటున్నారు. వ్యాక్సిన్ రేట్ల విషయంలో చాలా గందరగోళం కొనసాగటం కూడా ఈ ప్రక్రియ మందకొడిగా సాగడానికి ఒక కారణంగా భావిస్తున్నట్లు వైద్యులు అంటున్నారు. తాజాగా ప్రకటించిన ధరల ప్రకారం కొనిషీల్డ్, కొవ్యాగ్జిన్ రేట్లు రూ.225గా ఉన్నాయి. ఇంతకు ముందు కొనిషీల్డ్ ధర రూ.600గా ఉంది. కొవ్యాగ్జిన్ రేటు డోసుకు రూ.1200గా ఉంది. ధరల విషయంలో స్పష్టత లేనందున కొన్ని చోట్ల ముందుగానే మూడో డోసు వ్యాక్సిన్ తీసుకున్న వారు ప్రభుత్వం నిర్ణయించిన దాని కంటే ఎక్కువ మెుత్తం చెల్లించారు. మరికొన్ని ఆసుపత్రుల్లో ప్రభుత్వం ప్రకటించిన రేటుపై 5 శాతం జీఎస్టీ, రూ.150 సర్వీస్ ఛార్జ్ కలిపి వసూలు చేస్తున్నాయి.

ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రస్తుతం ఉన్న కోవాక్సిన్ స్టాక్‌లతో ధర వ్యత్యాసాన్ని ఎడిషినల్ స్టాక్ అందించటం ద్వారా భర్తీ చేయనున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఒక కమ్యూనికేషన్‌లో, SIIలోని ప్రభుత్వ, నియంత్రణ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్ ఆదివారం తెలిపారు.

ఇవీ చదవండి..

Bank Alert: ఆ బ్యాంక్ ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్.. భారీగా వడ్డీ రేట్లు తగ్గింపు..

 Elon Mask: ట్విట్టర్ బోర్డు సభ్యత్వంలో ట్విస్ట్ ఇచ్చిన ఎలాన్ మస్క్.. వెల్లడించిన సీఈవో..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!