AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: మాగ్నెట్ ఫిషింగ్ చేస్తుండగా గాలానికి చిక్కిన బీరువా… లోపల కాసుల పంట

నీళ్లలో పడిపోయిన విలువైన వస్తువుల వేటకు వెళ్లిన ఓ జంటను అదృష్ట దేవత కరుణించింది. ఉన్నపలంగా లక్షాధికారులను చేసింది. మాగ్నెట్ ఫిషింగ్ చేసిన ఆ జంటకు ఓ ఇనుప పెట్టె దొరికింది. దాన్ని ఓపెన్ చేయగా... లోపల కనిపించింది చూసి ఆశ్చర్యపోయారు. ఫుల్ డీటేల్స్ తెలుసుకుందాం పదండి....

Viral: మాగ్నెట్ ఫిషింగ్ చేస్తుండగా గాలానికి చిక్కిన బీరువా... లోపల కాసుల పంట
Magnet Fishing
Ram Naramaneni
|

Updated on: Jun 03, 2024 | 12:53 PM

Share

చేపల కోసం వల వేయడం తెల్సు.. ఇది జనరల్ ఫిషింగ్.. కానీ మీకు మాగ్నెట్ ఫిషింగ్ గురించి తెల్సా..?. సరస్సులు, కొలనులు, చెరువులు, బావులు, నదుల్లో… అయస్కాంతాన్ని జారవిడిచి వస్తువులను బయటకు తీయడాన్ని మాగ్నెట్ ఫిషింగ్ అంటుంటారు. ఈ కల్చర్ ఎక్కవగా అమెరికా లాంటి పాశ్చాత్త దేశాల్లో ఉంటుంది. తాజాగా యూస్‌లోని న్యూయార్క్ సిటీ క్వీన్స్ ఏరియాలో ఫ్లషింగ్ మీడౌస్ కరోనా పార్కులో గల సరస్సు వద్ద.. మాగ్నెట్ ఫిషింగ్‌కు వెళ్లిన ఓ జంటకు అనుకోని అదృష్టం వరించింది. జేేమ్స్ కేన్, బార్బీ అగోస్టిన్ జంట.. అయస్కాంతానికి తాడు కట్టి.. ఆ గాలాన్ని సరస్సులోకి జారవిడిచారు. కాసేపటి తర్వాత బరువుగా అనిపించడంతో.. పైకి లాగగా కనిపించింది చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఏకంగా ఒక బీరువానే వారికి చిక్కింది. అందులో ఏముందా ఓపెన్ చేయగా.. ఏకంగా లక్ష డాలర్లు అంటే దాదాపు 83 లక్షల రూపాయల సొమ్ము ఉంది. దీంతో వెంటనే వారు స్థానిక పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. సదరు బీరువాతో ఏ క్రైమ్‌కు సంబంధం లేదని.. ఆ జంట పోలీసులకు వివరించారు. గతంలో కూడా ఇలాంటి బీరువాలను కనుగొన్నామని.. ఈ బీరువా ఓనర్ ఎవరో కనుక్కోడానికి ఎటువంటి డాక్యుమెంట్స్ అందులో లేవని వారు చెప్పారు. దీంతో పోలీసులు ఆ బీరునా.. ఆ జంట తీసుకునేందుకు అనుమతించారు.

Us Cash

అయితే ఆ బీరువాలోని చాలా నోట్లు తడిచి.. పాడయ్యాయని.. వాటిలో ఎంత మేర సరిగ్గా ఉన్నాయో త్వరలో చెబుతామన్నారు. కాగా ఈ జంటకు గతంలోనూ అనేక బీరువాలను కనుగొన్నారట. గతంలో 19వ శతాబ్దం నాటి తుపాకులు, సెకండ్ వరల్డ్ వార్‌ కాలం నాటి గ్రెనెడ్స్ ఇలాగే దొరికాయని ఈ జంట తెలిపింది. కాగా గతంలో ఇలా మాగ్నెట్ ఫిషింగ్ చేస్తుండగా… రకరకాల ఆయుధాలు, వివిధ వస్తువులు బయటపడిన దాఖలాలు ఉన్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…