AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: సాధారణ తనిఖీలు.. ఓ వ్యక్తిని ఆపిన పోలీసు.. అతడి ఫోన్ గ్యాలరీలో ఫోటోలు చూడగా

ఓ వ్యక్తి హాయిగా తన బైక్‌పై ఇంటికి వెళ్తున్నాడు. బెంగళూరు రోడ్డుపై వెళ్తున్న అతడిని పోలీసులు ఆపారు. నార్మల్ డ్రగ్స్ చెకింగ్ అంటూ చెక్ చేశాడు. ఆ తర్వాత అతడి ఫోన్ ఓపెన్ చేసి గ్యాలరీ చూడగా.. ఆ వివరాలు ఇలా..

Viral: సాధారణ తనిఖీలు.. ఓ వ్యక్తిని ఆపిన పోలీసు.. అతడి ఫోన్ గ్యాలరీలో ఫోటోలు చూడగా
Representative Image
Ravi Kiran
|

Updated on: Aug 20, 2025 | 12:16 PM

Share

ఎన్నో చట్టాలు తెచ్చినా, పోలీసులు ఎక్కడిక్కడ సెర్చ్ ఆపరేషన్ చేపట్టినా.. డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్ధాలు రాష్ట్రాల సరిహద్దులు యదేచ్చగా దాటేస్తున్నాయ్. ఇంకా గట్టిగా చెప్పాలంటే.. దేశమంతా ఇదే తంతు. అధికారులు ఎలప్పుడూ మాదకద్రవ్యాల తనిఖీలు నిర్వహిస్తే అది మంచిదే. కానీ ఎప్పుడూ ఒకేలా ఉండదు. బెంగళూరుకు చెందిన ఓ 26 ఏళ్ల వ్యక్తి.. డ్రగ్స్ చెకింగ్ అంటూ పోలీసులు చేసిన ఓ తనిఖీలో చాలా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఏమి చేయాలనే నిస్సహాయస్థితిలో ఉన్న ఆ సదరు వ్యక్తి తన అనుభవాన్ని రెడ్డిట్ ద్వారా నెటిజన్లతో పంచుకున్నాడు.

ఆ పోస్ట్ ప్రకారం, స్థానిక ఇందిరానగర్ సమీపంలో రాత్రి 10:30 గంటల ప్రాంతంలో తన స్కూటర్‌పై ఇంటికి వెళుతుండగా.. అతడ్ని కొంతమంది పోలీసులు ఆపారు. ఇదొక రొటీన్ డ్రగ్స్ చెక్ అంటూ ఆ వ్యక్తిని తనిఖీ చేశారు. ఆ తర్వాత అతడి ఫోన్‌ను తనిఖీ చేయాలంటూ పోలీసులు అడిగారు. కొంతసేపటి వరకు అంతా బాగానే ఉంది. ఎప్పుడైతే ఆ పోలీసు.. సదరు వ్యక్తి ఫోన్ గ్యాలరీ అతడి లవర్ ప్రైవేటు ఫోటోలను జూమ్ చేసి మరీ చెక్ చేస్తుంటే.. ఏం చేయాలో పాలుపోలేదు. చివరికి ఆ ఫోన్ తిరిగిచ్చిన పోలీస్.. వెకిలి నవ్వు నవ్వుతూ.. అతడికి ఓ వెటకారపు సలహా ఇచ్చాడు.

‘ఈ ఫొటోలన్ని కూడా నీ పర్సనల్ స్పేస్‌లో ఉంచుకోవాలి బ్రో’ అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయాడట. ఇక ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ కాగా.. నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తించారు. ఈ ఘటన పట్ల పలువురు అతడ్ని హెచ్చరించగా.. మరికొందరు ఆ వ్యక్తి తన భాగస్వామితో ఉన్న సన్నిహిత ఫోటోలకు ఎందుకని పాస్‌వర్డ్ పెట్టుకోలేదంటూ విమర్శించారు. ఇందుకోసమే కదా బ్రో.. ఫోన్‌లో లాక్డ్ ఫోల్డర్స్, ప్రైవేటు ఫోల్డర్స్ ఉండేవి అని ఒకరు కామెంట్ చేయగా.. ఇలాంటి బాయ్‌ఫ్రెండ్ నాకు ఎప్పటికీ దొరకకూడదని మరొకరు రాసుకొచ్చారు. అలా సెర్చ్ చేసే ముందు వారంట్ చూపించమని అడగాలి బ్రో అని ఇంకొకరు కామెంట్ చేశారు.

ఇవి కూడా చదవండి

Cops stopped me for a “drug check” and went through private photos of my girlfriend byu/passionate-curiosity inLegalAdviceIndia

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..