Viral Video: మనకు కొద్ది దూరంలో పాము కనిపిస్తేనే భయంతో అక్కడి నుంచి పరుగులు తీస్తాం. అలాంటిది మన చేతికే ఆ పాము తాకితే.. పరిస్థితి వర్ణనాతీతం. భయం పీక్స్‌కు చేరి.. గుండె ఆగిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తాజాగా అలాంటి పరిస్థితి కొందరు ప్రయాణికులు ఎదుర్కొన్నారు. పాము చేతికి తాకడంతో జడుసుకున్నారు. బస్సులో నుంచి అందరూ కిందకు పరుగులు తీశారు. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
కర్ణాకటలో కదులుతున్న బస్సులో ఆరు అడుగుల పొడవైన నాగుపాము కనిపించింది. అది చూసి ప్రయాణికులు జడుసుకున్నారు. చిక్కబల్లాపూర్ జిల్లాలో కేఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికులు కిందకు దిగారు. ఆ సమయంలో బస్సు డోర్ వద్ద ఏదో వింత శబ్ధాలు వినిపించాయి. వెంటనే విషయాన్ని బస్ డ్రైవర్‌కు తెలిపారు. దాంతో డ్రైవర్ బస్సును రోడ్డపై నిలిపివేసి.. ఏంటా చెక్ చేశాడు. ఆ సమయంలో చేతికి వింత వస్తువు తగిలింది. స్పర్శ కాస్త తేడాగా అనిపించడంతో.. ఇంకాస్త పరిశీలించి చూశాడు. అంతే ఒక్కసారిగా బుసలు కొడుతూ పాము కనిపించింది. దెబ్బకు డ్రైవర్ సహా, ప్రయాణికులు హడలిపోయారు. ప్రయాణికులు అంతా బస్సు దిగారు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించగా.. అతను వచ్చి బస్సు గేట్‌లో నక్కి ఉన్న భారీ పామును బయటకు తీశాడు. పాము పెద్దగా ఉండటాన్ని చూసి హడలిపోయారు జనాలు. మొత్తానికి పామును సురక్షితంగా బయటకు తీసి.. నిర్మానుష్య ప్రాంతంలో విడుదల చేశారు. అయితే, ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. ఈ వీడియోన చూసి నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు.
चलती बस में 6 फीट लंबा Cobra दिखने के बाद मची दहशत, काफी मशक्कत के बाद बाहर निकाला गया बाहर#Karnataka #Cobra #Viral #Video #socialmedia pic.twitter.com/kr0gb2FoQh
— Shalini Singh (@shalinisengar23) August 31, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..