వందే భారత్ రైలు భారతదేశంలోని అనేక నగరాల మధ్య నడిచే ప్రీమియం రైళ్లలో ఒకటి. అయితే ఈ రైలుపై రాళ్లు రువ్విన ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. ప్రయాగ్‌రాజ్ నుంచి గోరఖ్‌పూర్ మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైరల్ వీడియోలో వందేభారత్ రైలు గ్రామీణ ప్రాంతం గుండా ప్రయాణిస్తున్నట్టుగా వీడియోలో కనిపిస్తోంది. ఇంతలో ఇద్దరు పిల్లలు అక్కడికి చేరుకున్నారు. వారు రైలు వైపు రాళ్ళు విసురుతున్నారు. రైలులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు దీన్ని వీడియో తీశాడు. ఒకటి రెండు సార్లు కాదు చాలా సార్లు రాళ్లు రువ్వి రైలు కిటికీని పాడు చేసేందుకు పిల్లలు ప్రయత్నించారని రైల్లో ప్రయాణిస్తున్నవారు చెప్పారు.
ఈ వీడియో రెడ్‌డిట్‌లో “డ్యూకాలియన్” అనే వినియోగదారు ద్వారా షేర్ చేశారు. ఆ తర్వాత ఇది అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వీడియో వైరల్ అవుతోంది. కొంతమంది పిల్లల ఇలాంటి ప్రవర్తనను మూర్ఖత్వం అంటూ మండిపడుతుండగా, మరికొందరు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి వీడియోపై నెటిజన్లు తీవ్రస్థాయిలో స్పందించారు. ఇలాంటి పని చేయడం వల్ల ఈ పిల్లలు ఏం లాభం పొందుతారని సోషల్ మీడియా యూజర్ ఒకరు రాశారు. చిన్న పిల్లలకు రాళ్లు విసరడం ఎవరు నేర్పుతున్నారు అని మరొకరు రాశారు. ఈ వయసు నుంచే ఈ పిల్లలకు ఇలాంటి మనస్తత్వం ఉంటే ఇక భవిష్యత్తులో ఏం చేస్తారని సోషల్ మీడియా యూజర్ ఒకరు రాశారు. పిల్లలను పట్టుకుని జువైనల్ హోంలో పెట్టాలని మరొకరు రాశారు.
Posts from the indianrailways
community on Reddit ఇవి కూడా చదవండి
ఈ పిల్లలు తమ చుట్టూ ఉన్న వాతావరణం ద్వారా ప్రభావితమవుతారని సోషల్ మీడియా వినియోగదారు మరొకరు రాశారు. పేదరికం, విద్య లేమికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అంటున్నారు. ఇది తమ తప్పు కాదని, ఐపీఎల్ తప్పిదమని మరొకరు వ్యంగ్యంగా రాశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..