
ఆహార ప్రయోగాల పేరుతో.. ప్రజలు ఎటువంటి వంటకాలను అయినా చేయడానికి రెడీ అవుతున్నారు. కొన్ని రకాల వంటల తయారీ చూస్తే చాలు వంతులు వస్తాయా అనిపిస్తుంది కొందరికి. కొత్త వంటకాలు తయారు చేస్తూ వంటలపై రకరకాల ప్రయోగాలను చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫుడ్ కి సంబంధించిన వీడియో చూసి ఆహార ప్రియులు షాక్ తింటున్నారు. ఇదేమి ఆహార ప్రయోగాలురా బాబు అంటూ ఆక్రోశిస్తున్నారు. ఆ ఆహార పదార్ధాన్ని తినడానికి ఇష్టపడం అన్న మాట అటుంచి.. కనీసం చూడడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే ఆ వీడియోలో చెఫ్ బిర్యానీతో కేక్ తయారు చేశాడు.
మిగలిన బిర్యానీ వృధా కాకుండా చేయడానికి ఒక ప్రముఖ చెఫ్ .. బిర్యానీతో కేక్‌ని తయారు చేశాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది. కేక్ చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. అయితే దీనిని ఎవరు తింటారనే ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకంటే ఈ కేక్ చూసిన తర్వాత బిర్యానీ ప్రియుల కోపం ఆకాశాన్ని తాకింది.
వీడియోను ఇక్కడ చూడండి
వీడియోలో చెఫ్ మిగిలిపోయిన బిర్యానీని వేర్వేరుగా కేక్ పొరలలో అమర్చడాన్ని మీరు చూడవచ్చు. దీని తరువాత బిర్యానీని కేక్ అచ్చులో నొక్కి, పైన పెరుగు, పుదీనా చట్నీ వేసి… దాని పైన ఒక ప్రత్యేక పొరను ఏర్పాటు చేశాడు. చూడడానికి ఇది సరిగ్గా కేక్ లాగా కనిపిస్తుంది. చివరగా కేక్ డెకరేషన్ గా కారంగా ఉండే మాంసం ముక్కలను ఉంచి అలంకరించాడు చెఫ్.
ఈ వీడియో thejoshelkin అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేయబడింది. దీనిని ఇప్పటివరకు లక్షలాది మంది చూశారు. ఈ కేక్ ని చూసి బిర్యానీ ప్రియులు ఈ వంటకాన్ని వ్యతిరేకించాలా లేక ప్రశంసించాలా అని అయోమయంలో పడ్డారు… ఈ బిర్యానీ రుచి ఎలా ఉన్నా, ఇది చాలా బాగుంది అని ఒక యూజర్ రాశారు. మరొకరు ఈ కేకు బిర్యానీ ప్రియులకు ఒక పీడకల లాంటిది’ అని వ్యాఖ్యానించారు. మరొకరు ఆహారాన్ని వృధా చేయకూడదని నేను అంగీకరిస్తున్నాను అయితే ఇలాంటి సరికొత్త ప్రయోగాలను మాత్రం అంగీకరించను అని కామెంట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..