Viral Video: ఈ వీడియో చూస్తే చాలా చిన్ననాటి మధురజ్ఞాపకాలు గుర్తుకువస్తాయి.. నెట్టింట వైరల్

చిన్నప్పుడు ఇంట్లో దూలానికి, పెరట్లో చింతచెట్టుకు కట్టి ఊగిన ఊయల అందరికీ గుర్తే ఉండి ఉంటుంది..అదంటే అందరికీ ఇష్టమే. మనందరికీ మరచిపోలేని మధురానుభూతుల్ని మిగిల్చే

Viral Video: ఈ వీడియో చూస్తే చాలా చిన్ననాటి మధురజ్ఞాపకాలు గుర్తుకువస్తాయి.. నెట్టింట వైరల్
Chicken

Updated on: May 02, 2022 | 5:05 PM

Viral Video: చిన్నప్పుడు ఇంట్లో దూలానికి, పెరట్లో చింతచెట్టుకు కట్టి ఊగిన ఊయల అందరికీ గుర్తే ఉండి ఉంటుంది..అదంటే అందరికీ ఇష్టమే. మనందరికీ మరచిపోలేని మధురానుభూతుల్ని మిగిల్చే అద్భుతమైన ఆట అది. ఉయ్యాలను చూస్తే చాలు ప్రతి ఒక్కరికీ మళ్లీ తమ చిన్నతనం గుర్తొస్తుంది. కొంతమంది వయసును కూడా మర్చిపోయి ఉయ్యాలకనిపిస్తే చాలు ఊగలని ట్రై చేస్తూ ఉంటారు. ఐతే.. మనుషులే కాదు.. తమకూ ఉయ్యాల అంటే ఇష్టమే అంటోంది ఓ కోడి. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
ఈ వైరల్ వీడియాలో..చుట్టూ అంతా మంచు కురుస్తుంది..అక్కడే ఉన్న ఓ ఇంటి ఆవరణలో ఊయల కట్టి ఉంది.. గొలుసులతో ఉన్న ఆ ఉయ్యాలకు మధ్యలో చెక్కపీట లేకుండా, ఓ సన్నటి కట్టే లాంటిది ఏర్పాటు చేశారు. దానిపై నిలబడిన కోడి… ఊయలను అటూ ఇటూ ఊపుతూ తెగ ఎంజాయ్‌ చేసింది.. మధ్యమధ్యలో కిందపడకుండా ఉండేందుకు మనం ఎలాగైతే చేతులతో గొలుసుల్ని పట్టుకుంటామో… అలా ఆ కోడిపెట్ట.. తన రెక్కలతో గొలుసుల్ని టచ్ చేస్తూ ఊగింది. నిజంగానే భలేగా ఉంది ..మీకు బాగా నచ్చేస్తుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియో పై తమదైన స్టైల్ లో కామెంట్స్ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం ఈ వీడియో చూసేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Telangana News: చిన్నారి చనిపోయిందని అంత్యక్రియలు చేయబోయారు. చివరి నిమిషంలో ఊహించని పరిణామం

LIC IPO: నేటి నుంచి ఎల్ఐసీ ఐపీవో ప్రారంభం.. పాల్గొనేందుకు ముందుగా వారికే అవకాశం..

Viral Photo: బూరె బుగ్గల చబ్బీ గర్ల్ ఎవరో గుర్తుపట్టండి.. టాలీవుడ్‏లోనే క్రేజీ హీరోయిన్..