కుక్కను కాపాడిన చాట్ జీపీటీ…వైద్యులు షాక్

వైద్యులు చేయలేని పనిని చాట్ జీపీటీ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటీవల చాట్ జీపీడి మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. ఈ సాంకేతికతను వినియోగించుకోని ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క ప్రాణాలు కాపాడుకున్నాడు.

కుక్కను కాపాడిన చాట్ జీపీటీ...వైద్యులు షాక్
Dog

Updated on: Mar 27, 2023 | 9:04 PM

వైద్యులు చేయలేని పనిని చాట్ జీపీటీ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటీవల చాట్ జీపీడి మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. ఈ సాంకేతికతను వినియోగించుకోని ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క ప్రాణాలు కాపాడుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే కూపర్ అనే వ్యకి పెంపుడు కుక్క టిక్ బోర్న్ అనే జబ్బుతో అనారోగ్యం పాలైంది. చికిత్స కోసం అతను వెటర్నరీ వైద్యులను సంప్రదించాడు. రక్తహీనత ఏర్పడటం వల్లే కుక్క అనారోగ్యం పాలైనట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం చికిత్స చేశాక దాని ఆరోగ్యం మెరుగుపడింది. కానీ కొన్ని తర్వాత మళ్లీ అదే అనారోగ్య స్థితికి వెళ్లిపోయింది. దీంతో చేసేదేమి లేక కూపర్ మరోసారి ఆస్పత్రికి తీసుకెళ్లి టిక్ బోర్న్ పరీక్షలు చేయించాడు. రిపోర్టు నెగటీవ్ వచ్చింది. కుక్క ఆరోగ్య విషయం గురించి పూర్తిగా తెలుసుకునేందుకు కొన్ని రోజులు ఆగాలని వైద్యులు సలహా ఇచ్చారు.

అయితే ఆ సలహా కూపర్ కు నచ్చలేదు. మరో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. చివరికి అతను చాట్ జీపీటీని ఆశ్రయించాడు. తన కుక్క అనారోగ్య సమస్యను చాట్ జీపీటీ-4 కి వివరించాడు. అయితే చాట్ జీపీటీ తాను వెటర్నరీ డాక్టర్ ను కాదంటూనే కుక్కకి తీసిన బ్లడ్ శాంపిల్స్ ను బట్టి మీ కుక్క ఎందుకు అనారోగ్యం పాలైందో అర్థం చేసుకోవడంలో సహాయపడతానని తెలిపింది. జబ్బులకు సంబంధించిన లక్షణాల గురించి ఓ డేటాను అందించింది. చాట్ జీపీటీ చెప్పిన అనారోగ్య సమస్యలు సాసీలో ఉన్నాయని బదులివ్వడంతో మీ కుక్క ఇమ్యూన్-మెడియేటెడ్ హెమోలిటిక్ అనీమియా అనే సమస్యతో బాధపడుతోందని తెలిపింది. ఈ విషయంపై వైద్యుడ్ని ఆశ్రయించిన కూపర్ ఐఎంహెచ్ఏ సమస్య ఉందా అని ప్రశ్నించాడు. రక్తపరీక్ష చేసిన వైద్యులు అదే జబ్బుతో కుక్క బాధపడుతున్నట్లు తేల్చేశారు. ఆ తర్వాత దానికి చికిత్స అందించారు. ప్రస్తుతం తన కుక్క ఆరోగ్యం కుదుటపడిందంటూ చాట్ జీపీటీతో చేసిన సంభాషణ స్క్రీన్ షాట్ లను కూపర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..