చాయ్ అంటే ఇష్టపడని వారుంటరా.. చెప్పండి.. ఈ ప్రపంచంలో టీ అంటే ఇష్టపడేవాళ్లే ఎక్కువగా ఉంటారు. ఇక మన ఇండియన్స్‌కి చాయ్ పట్ల ఎంత మక్కువో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఉదయం, మధ్యాహ్నం,సాయంత్రం అయినా సరే.. ఒక కప్పు వేడి వేడి కడక్ చాయ్ ఆస్వాదించడానికి సై అంటారు. ఇకపోతే, అందరికీ ఇష్టమైన ఈ చాయ్ తయారుచేసేటప్పుడు ఒక్కొక్కరూ ఒక్కో స్టైల్లో తయారు చేస్తుంటారు. కొందరికి ఇది తీపి, కొందరికీ ఎక్కువ పాలతో ఉంటే ఇష్టం అయితే, ఎక్కువ మంది అల్లం, యాలకులతో స్ట్రాంగ్ టీని ఇష్టపడుతుంటారు. అయితే, మీరు ఎప్పుడైనా కొబ్బరి చిప్పలో తయారుచేసే టీని ప్రయత్నించారా? ఇటీవల, ఇంటర్నెట్‌లో వైరల్ అయిన ఒక వీడియో బోలు కొబ్బరి చిప్పలో టీ తయారు చేస్తున్నట్లు చూపిస్తుంది. చాయ్ తయారుచేసే ఈ ప్రత్యేకమైన పద్ధతికి ఇంటర్నెట్ వినియోగదారులు అవాక్కై చూస్తున్నారు.. అదేలాగో తెలుసుకుందాం..
కొబ్బరి చిప్పలో చాయ్ తయారు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక మహిళ ఖాళీ కొబ్బరిచిప్పలో చాయ్ చేసి చూపించింది. ముందుగా స్టావ్ వెలిగించింది. ఆపై ఖాళీ కొబ్బరి చిప్పను పెట్టి అందులో ఒకకప్పు నీళ్లు పోసింది.. ఆ తర్వాత టీ తయారీకి కావాల్సిన అల్లం, పాలు, చక్కెర, టీ ఆకులు, యాలకుల పొడి వంటి పదార్ధాలను వేసి కలుపుతుంది. ఆపై అది బాగా మసిలి.. పొంగువచ్చేలా వేడి చేసింది.. అంతే గరం గరం చాయ్ తయారైంది..
ఇంకేముందు ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నది. ఇప్పటికే 4.72 కోట్ల మంది ఈ కొబ్బరి చిప్పలో చాయ్ తయారీని చూసేశారు.. 8.73 లక్షల మంది లైక్ చేశారు. అంతేగాక వేల మంది కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఒక వినియోగదారు అమ్మ తంతుంది అని కామెంట్ చేస్తే..మరో వ్యక్తి కూడా సరదా కామెంట్ చేశాడు. భలే ఐడియా గురూ ..! ఇలా చేస్తే ఇకపై ఇంట్లో గిన్నెలు కడిగే పనేలేకుండా పోతుందని కామెంట్ చేశారు. ఇక ఆ కొబ్బరి చిప్ప కాలిపోతే ఉంటుంది తమాషా..! అంటూ కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..