Cat Jumping From Building: ఇటీవల ఓ భవనంలోని ఐదో అంతస్థులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తూనే.. అందులో ఉండే వారందరినీ సేఫ్‌గా కిందికి తీసుకొచ్చారు కానీ అక్కడ ఓ పిల్లి కూడా ఉందనే విషయాన్ని ఎవరూ గమనించలేదు. కాసేపటి తర్వాత బిల్డింగ్ కింద ఉన్నవారు ప్రమాద దృశ్యాలను వీడియో తీస్తుండగా ఆ పిల్లి కనిపించింది.
దాంతో వెంటనే వారంతా ఆ పిల్లిని కాపాడాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా కిందున్న వారంతా దాన్ని ఎలా కాపాడాలా అని ఆలోచిస్తుంటే… ఆ పిల్లి కూడా అటూ ఇటూ తిరుగుతూ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు మార్గాలు వెతుక్కోసాగింది. పిల్లిని కాపాడేందుకు వీలుకాకపోవడంతో అయ్యోపాపం ఇక ఆ పిల్లి చచ్చిపోతుందేమో అనుకుంటూ అంతా టెన్షన్ పడుతుండగా.. సడెన్‌గా ఆ పిల్లి ఐదో అంతస్థు నుంచి కిందకు దూకేసింది. అచ్చు సినిమాల్లో దూకే విధంగా.. కరెక్టుగా దాని కాళ్లు నేలపై పడేలా దూకింది. పిల్లి కిందికి దూకడం చూసినవాళ్లంతా మొదట షాక్ అయినప్పటికీ.. తర్వాత అది సాఫీగా నడుచుకుంటూ వెళ్లడం చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు.
నిజానికి పిల్లులు 20 అంతస్థుల భవనం నుంచి కింద పడినా చనిపోవు. ఎందుకంటే… వాటి కాళ్ల కింద స్పాంజీలా ఉంటుంది. కిందకు దూకగానే… ఆ స్పాంజీ బాడీకి దెబ్బ తగలకుండా కాపాడుతుంది. ఆ స్పాంజీ కారణంగానే… పిల్లులు నడిచినప్పుడు సౌండ్ కూడా రాదు. కాగా, పిల్లులు భవనాలపై నుంచి దూకడం ఇదేం తొలిసారి కాదు. 2019లో ఇంగ్లండ్‌లో ఓ పిల్లి… 18వ అంతస్తు నుంచి కిందకు దూకింది. దానికి చిన్న దెబ్బ కూడా తగల్లేదు. మొత్తానికి ప్రస్తుత ఘటనలో కూడా పిల్లి సేఫ్‌గా బయటపడింది.
Also Read:
ఇండియాకు 7 వేల కోట్లు విరాళంగా ఇచ్చిన 27 ఏళ్ల యువకుడు.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
చిరుతపై సింహం సాలిడ్ ఎటాక్.. చివరికి గెలిచిందేవరంటే.? షాకింగ్ దృశ్యాలు..
‘సెక్స్ కోసం వెళ్లాలి’.! ఈ-పాస్ ఇవ్వండి.. పోలీసులకు వింత రిక్వెస్ట్.. అసలు విషయమేమిటంటే.!
Nine lives for a cat that jumped from fire at 65th and Lowe. Cat hit grass bounced and walked away! pic.twitter.com/LRBsjMta2Z
— Chicago Fire Media (@CFDMedia) May 13, 2021