ప్రపంచంలో వివిధ రకాల జంతువులు ఉన్నప్పటికీ పెంపుడు జంతువులు మాత్రం వేటికవే ప్రత్యేకం. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కుక్కలు, పిల్లుల గురించే. కాగా సోషల్ మీడియాలో పెట్ ఆనిమల్స్ వీడియోలు ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాయి. అవి చేసే అల్లరి, మంచి పనులు, స్టంట్స్ వంటివి నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తాయి. ప్రస్తుతం ఓ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ పిల్లి మరొక పిల్లికి మసాజ్ చేస్తూ కనిపిస్తుంది. ఒక పిల్లి హాయిగా పడుకోగా, మరో పిల్లి వీపుపై నొక్కుతూ మసాజ్ చేయడాన్ని మనం వీడియోలో చూడవచ్చు. మనుషులు మసాజ్ చేసే వీడియోలను మనం చూసే ఉన్నాం. కానీ పిల్లి ఇలా మసాజ్ చేయడం ఎప్పుడూ చూడకపోవడంతో ఈ ఫన్నీ వీడియో ప్రజల హృదయాలను గెలుచుకుంది. ఈ వీడియో @Yoda4ever అనే ఐడీతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. కేవలం 8 సెకన్ల ఈ వీడియోకు ఇప్పటివరకు 2 మిలియన్లు వ్యూస్ వచ్చాయి. అంతే కాకుండా ఈ సంఖ్య పెరుగుతోంది. ఒక యూజర్ ‘అమేజింగ్ మసాజ్’ అని కామెంట్ చేస్తే, మరో యూజర్ ‘మసాజ్ ఛార్జీ ఎంత’ అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Kitty massage..???? pic.twitter.com/GwH2O2N7Qp
ఇవి కూడా చదవండి— ?o̴g̴ (@Yoda4ever) July 4, 2022