Viral Video: రోడ్డు దాటుతున్న పాముకు షాక్ ఇచ్చిన పిల్లి.. తర్వాత ఏం జరిగిందంటే

|

Jun 16, 2022 | 6:31 PM

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే. వీటిలో కొన్ని భయాన్ని కలిగించేవి అంతే మరికొన్ని నవ్వులు పూయిస్తాయి.

Viral Video: రోడ్డు దాటుతున్న పాముకు షాక్ ఇచ్చిన పిల్లి.. తర్వాత ఏం జరిగిందంటే
Cat
Follow us on

Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే. వీటిలో కొన్ని భయాన్ని కలిగించేవి అంతే మరికొన్ని నవ్వులు పూయిస్తాయి. ఇలాంటి వీడియోలను చూడటానికి నెటిజన్లు ఆసక్తి చూపుతుంటారు. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జంతువుల మధ్య వైరం ఉండటం సహజం. వీటిలో పిల్లికి పాముకు కూడా వైరం ఉంటుంది. పాము పిల్లి ఎదురైతే భీకర పోరాటమే ఉంటుంది. తాజాగా వైరల్ అవుతోన్న వీడియో కూడా అదే. ఈ వీడియోలో పాము, పిల్లి పోట్లాడుకోవడం చూడొచ్చు. ఓ పాము పై ఓ నల్ల పిల్లి దాడికి పాల్పడింది. అప్పుడు ఏమైందంటే..

ఓ చిన్నపాము రోడ్డు దాటుతుండగా ఓ నల్ల పిల్లి దాన్ని గమనించింది. దానిమనన అది రోడ్డు దాటుతుంటే దాని దగ్గరకు వెళ్లి దాన్ని నీటితో పట్టుకుంటుంది. వెంటనే ఆ పాము ఆ పిల్లి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఎలాగోలా విడిపించుకొని అక్కడి నుంచి జారుకుందాం అనుకునేలోగా మరోసారి ఆ పిల్లి దాడి చేసింది. వెంటనే ఆ పామును నొట్టికి కరుచుకొని అక్కడి నుంచి పరిగెత్తింది ఆ పిల్లి. ఈ షాకింగ్ వీడియోను ఇప్పటి వరకు చాలా మంది వీక్షించారు. ఈ వైరల్ వీడియోను meowcat_happypet ద్వారా ఇన్స్టా గ్రామ్ లో షేర్ చేయబడింది. ఈ వీడియోకి ఇప్పటివరకు 31.9k వ్యూస్ అలాగే అనేక లైక్‌లు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.