AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధూమ్ ధామ్ గా సాగుతున్న పెళ్లి బరాత్‌.. వేగంగా దూసుకొచ్చిన లగ్జరీ కారు.. ఆ తర్వాత సీన్ ఇది

ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మొత్తం రోడ్డు పక్కన అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. స్థానికుల సమాచారం మేరకు సిటీ కొత్వాలి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌ వెంటనే పోలీసు బృందంతో సంఘటనా స్థలానికి సంబంధించిన సీసీ ఫుటేజ్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. 

Wedding Procession
Jyothi Gadda
|

Updated on: Jan 20, 2025 | 8:33 PM

Share

మధ్యప్రదేశ్‌లోని భింద్‌లో శనివారం రాత్రి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా జరిగిన ఓ వివాహ వేడుక ఊరేగింపు ప్రమాదానికి గురైంది. రోడ్డుపై ఊరేగింపు వెళ్తుండగా, పెళ్లికి వచ్చిన అతిథులు పాటలు పాడుతూ, డ్యాన్స్‌లు చేస్తూ వెళ్తున్నారు. అంతలోనే ఓ లగ్జరీ కారు వేగంగా దూసుకొచ్చింది. ఊరేగింపులో ఉన్న పలువురిని ఆ కారు ఢీకొట్టింది. ఆగకుండా అలాగే ముందుకు దూసుకెళ్లిన కారు.. వేగంగా వెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ షాకింగ్ సంఘటన సిటీ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సదర్ బజార్ ప్రాంతంలో జరిగింది.

ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మొత్తం రోడ్డు పక్కన అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. స్థానికుల సమాచారం మేరకు సిటీ కొత్వాలి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌ వెంటనే పోలీసు బృందంతో సంఘటనా స్థలానికి సంబంధించిన సీసీ ఫుటేజ్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మర దర్యాప్తు చేపట్టారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

ప్రమాదం జరిగిన వెంటనే జనం కారు డ్రైవర్‌ను పట్టుకున్నప్పటికీ, అతడు వారి నుంచి తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయాడని తెలిసింది. ప్రస్తుతం పోలీసులు గుర్తు తెలియని కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Follow Us
చరిత్ర సృష్టించిన సైమన్ హర్మర్.. 130 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!

శివ మాల వేసిన యాంకర్ స్రవంతి.. ఫొటోస్ ఇదిగో

శుక్రవారం ఈ చిన్న పనులు చేస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహంతో..

ఆ హీరోయిన్ కు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని..

ఈ 5 రకాల వ్యక్తులతో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోకండి.. జీవితంలో..

3 ఏళ్ల క్రితం వన్డే ప్రపంచకప్ ఫైనల్.. మరి ఇప్పుడేం చేస్తున్నారంటే

'నా కూతురిపై అలాంటి వార్తలు రాస్తారా?'.. అర్జున్ తీవ్ర ఆగ్రహం

లక్నో కెప్టెన్సీ రేసులో ముగ్గురు.. హింట్ ఇచ్చేసిన టామ్ మూడీ..!

కష్టాల్లో ఉన్నప్పుడు ఆ టాలీవుడ్ హీరో నాకు తిండి పెట్టాడు..

పసిడి పతనం.. సామాన్యుడికి సంబరం.. ఇన్వెస్టర్లకు షాక్..