Optical Illusion: ఈ ఫోటో‌లో ఓ వ్యక్తి రూపం దాగుంది.. 10 సెకన్లలో కనిపెట్టే సత్తా మీలో ఉందా?

ఎప్పటికీ ట్రెండ్‌లో నిలిచేది మాత్రం ఆప్టికల్ ఇల్యూజన్స్ అని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే.. ఈ టాస్క్‌లు కంప్లీట్ చేయడంలో మాంచి ఉత్సాహం, వినోదం, టైమ్ పాస్ అవుతుంది. అదే సమయంలో మన మెదడను మరింత షార్ప్ చేస్తుంది. ఏ రకంగా చూసినా ఇది మన ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి కారణమే అవుతుంది. బాడీ ఫిట్‌నెస్ కోసం మనం వ్యాయామం ఎలా చేస్తామో..

Optical Illusion: ఈ ఫోటో‌లో ఓ వ్యక్తి రూపం దాగుంది.. 10 సెకన్లలో కనిపెట్టే సత్తా మీలో ఉందా?
Optical Illusion

Updated on: Aug 08, 2023 | 8:27 AM

ఇంటర్నెట్‌లో కాలానుగుణంగా మనల్ని అలరించే అనేక రకాల విషయాలు వైరల్ అవుతుంటాయి. ఎన్ని వైరల్ అవుతున్నప్పటికీ.. ఎప్పటికీ ట్రెండ్‌లో నిలిచేది మాత్రం ఆప్టికల్ ఇల్యూజన్స్ అని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే.. ఈ టాస్క్‌లు కంప్లీట్ చేయడంలో మాంచి ఉత్సాహం, వినోదం, టైమ్ పాస్ అవుతుంది. అదే సమయంలో మన మెదడను మరింత షార్ప్ చేస్తుంది. ఏ రకంగా చూసినా ఇది మన ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి కారణమే అవుతుంది. బాడీ ఫిట్‌నెస్ కోసం మనం వ్యాయామం ఎలా చేస్తామో.. ఈ ఆప్టికల్ ఇల్యూజన్స్ మన బ్రెయిన్‌కు వ్యాయామంలా పని చేస్తాయి. అందుకే ఆప్టికల్ ఇల్యూజన్స్‌కి అంత క్రేజ్. తాజాగా సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూజన్ ఇమే బాగా వైరల్ అవుతోంది. దానికి నెటిజన్లు సైతం ఫిదా అయిపోతున్నారు. ఆ ఫోటో ఏంటి? దాని కథ ఏంటో తెలుసుకుందాం..

ఆప్టికల్ ఇల్యూజన్‌ను ట్రేస్ చేయడానికి పదునైన కళ్లు మాత్రమే కాదు.. మనస్సు కూడా చాలా చురుకుగా, ఓర్పుతో ఉండాలి. మరి ఈ లక్షణాలు మీలో ఉన్నాయా? ఉంటే ఈ టాస్క్‌ను ట్రేస్ చేయండి. తాజాగా హిమాలయ పర్వతాలకు సంబంధించిన ఓ ఫోటో వైరల్ అవుతోంది. అందులో ఓ వ్యక్తి ముఖం రూపం దాగి ఉంది. దానిని కనిపెట్టడమే మీ ముందు ఉన్న టాస్క్. వాస్తవానికి అందమైన ఆ హిమగిరులపై.. అంతే అందమైన వ్యక్తి ముఖ వర్ఛస్సును పోలిన రూపం కనువిందు చేస్తుంది. కొంచెం దృష్టి కేంద్రీకరిస్తే ఆ రూపాన్ని కనిపెట్టడం ఈజీ అవుతుంది. అయితే, ఈ రూపాన్ని మీరు కేవలం 10 సెకన్లలో మాత్రమే కనిపెట్టాలి. ఇది మీ మెదడు పనితీరు, కంటి చూపు సామర్థ్యాన్ని నిర్ధారిస్తుంది.

ఇలా గమనించండి..

వైరల్ అవుతున్న ఫోటోలో మంచు పర్వత శిఖరాలు ఉన్నాయి. ఈ శిఖరాల్లో ఓ వ్యక్తి ముఖం ఉంది. వ్యక్తి కళ్లు, ముక్కు, నోరును పోలి.. ఆ వ్యక్తి ఆకాశం వైపు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. సరిగ్గా గమనిస్తే.. ఆ రూపం కాస్త నవ్వుతున్నట్లుగా కూడా ఉంటుంది. పై పైన చూస్తే కాస్త గందరగోళంగా ఉన్నప్పటికీ.. కాస్త పరిశీలించి చూస్తే మాత్రం ఈజీగా కనిపెట్టేయొచ్చు.

ఇవి కూడా చదవండి

గుర్తించలేదా?

ఏంటీ ఇంకా కనిపించలేదా? మరేం పర్వాలేదు. ఈ ఫోటో లెఫ్ట్ సైడ్‌లో కింది భాగంలో మూలన ఉన్న నల్లటి రాతి కొండను పరిశీలించండి. పైన కళ్లు, ముక్కు, నవ్వుతున్నట్లుగా ఉండే నోరు ఆకారంలో కనిపిస్తుంటుంది. ఇంకా కనిపెట్టలేకపోతే.. కింద ఫోటోలో ఆ రూపాన్ని సర్కిల్ చేయడం జరిగింది పరిశీలించొచ్చు.

Optical Illusion

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..