మహిళ కళ్లల్లో 60కి పైగా సజీవ పురుగులు..! ఒక్కొక్కటిగా బయటకు తీసిన వైద్యులు.. ఏం జరిగిందంటే..

|

Aug 09, 2024 | 5:02 PM

మహిళ కళ్లలో పెద్ద సంఖ్యలో సజీవ లార్వా కనిపించటంతో వైద్యులు వెంటనే ఆమెకు శస్త్రచికిత్స ఏర్పాట్లు చేశారు. వాటిని ఒక్కొక్కటిగా తొలగించడానికి దాదాపు 2 గంటల సమయం పట్టింది. విశేషమేమిటంటే ఈ సంక్లిష్టమైన, అంతే ప్రమాదకర ఆపరేషన్‌ను డాక్టర్ స్వప్నీల్ ఉచితంగా చేశారు. ఇంతకీ ఏం జరిగిదంటే...

మహిళ కళ్లల్లో 60కి పైగా సజీవ పురుగులు..! ఒక్కొక్కటిగా బయటకు తీసిన వైద్యులు.. ఏం జరిగిందంటే..
60 Live Worm Removed from Woman's Eye
Follow us on

శరీరంలోని ప్రతి భాగం ముఖ్యమైనదే. అందులో మన కళ్ళు అత్యంత ముఖ్యమైనవి. కానీ, తరచూ మనం కళ్ల సంరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటాం.. ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఎదురైంది. కంటి సమస్యతో ఓ మహిళ వైద్యుడి వద్దకు వెళ్లింది. ఆమె కళ్లను పరిశీలించిన డాక్టర్‌ కంగుతిన్నాడు. ఎందుకంటే ఆ మహిళ కళ్లలో 60 సజీవ కీటకాలు కనిపించాయి. ఇలాంటి ఆశ్చర్యకర ఘటన మహారాష్ట్రలోని బుల్దానాలో చోటు చేసుకుంది. బుల్దానాలోని చిఖాలీ తాలూకాలోని మల్గానికి చెందిన ఓ మహిళ కళ్ల నుంచి 60 సజీవ సూక్ష్మీ జీవులు బయటికి వచ్చాయి. దీంతో డాక్టర్లు సైతం షాక్ అయ్యారు.

బుల్దానాలోని ఒక కంటి ఆస్పత్రి వైద్యులు జ్యోతి గైక్వాడ్‌ అనే మహిళ కంటి నుండి దాదాపు 60 లార్వాలను తొలగించారు. మహిళకు రెండు గంటల చికిత్స తర్వాత లార్వాలను తొలగించారు. ఈ కేసు చిఖాలీలోని మోర్వాల్ ఆసుపత్రిలో వెలుగుచూసింది. మహిళ కళ్లలో పెద్ద సంఖ్యలో సజీవ లార్వా కనిపించటంతో వైద్యులు వెంటనే ఆమెకు శస్త్రచికిత్స ఏర్పాట్లు చేశారు. వాటిని ఒక్కొక్కటిగా తొలగించడానికి దాదాపు 2 గంటల సమయం పట్టింది. విశేషమేమిటంటే ఈ సంక్లిష్టమైన, అంతే ప్రమాదకర ఆపరేషన్‌ను డాక్టర్ స్వప్నీల్ ఉచితంగా చేశారు. ఇంతకీ ఏం జరిగిదంటే…

బాధిత మహిళ జ్యోతిగైక్వాడ్‌ పొలంలో పని చేస్తుండగా అకస్మాత్తుగా కంటిలో మట్టి పడింది. ఆ సమయంలో ఆమె కంటికి ఎలాంటి గాయం కాలేదు. అయితే ఈ చిన్న సంఘటన తర్వాత జ్యోతికి తరచూ కళ్లు మండేవి. కంటికి ఏదో గుచ్చుతున్నట్టు హఠాత్తుగా నొప్పిగా ఉండేది. రోజురోజుకూ ఈ సమస్య పెరిగిపోయింది. చివరకు నొప్పిని భరించలేక డా. స్వప్నీల్ వద్దకు వెళ్లింది. డాక్టర్‌ ఆమె కంటిని పరిశీలించగా.. ఆమె కంటిలోపల కంటికి కనిపించని గాయం వల్ల లార్వా వచ్చినట్లు స్పష్టమైంది. ఈ లార్వాలను వెంటనే తొలగించాలని నిర్ణయించారు. హుటాహుటినా సర్జరీ చేసి 60 లార్వాలను ఒక్కొక్కటిగా తొలగించారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి నిలకడగా ఉందని, ఆమె కంటికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. ఆమెకు కంటిచూపు కూడా బాగానే ఉందని డాక్టర్ చెప్పారు. ప్రస్తుతం ఈ వింత ఉదంతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..