British Airways: విమానం గాల్లో ఉండగా చేయకూడని పని.. పైలట్‌పై వేటు

మీరు ఒక విమానంలో ప్రయాణిస్తున్నారని ఊహించుకోండి. ఆ సమయంలో పైలట్ తన విమాన నైపుణ్యాలను తన కుటుంబ సభ్యులకు చూపించడానికి కాక్‌పిట్ తలుపు తెరిచి ఉంచితే ఏం జరుగుతుందో ఊహించుకోండి..సరిగ్గా ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇది అందరినీ షాక్‌కు గురిచేసింది. విమానం నడుపుతున్నానని తన కుటుంబ సభ్యులకు చూపించడానికి పైలట్ ఇంత భయంకర తప్పు చేశాడు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎయిర్‌లైన్స్ అతన్ని సస్పెండ్ చేసింది! ఈ ఘటన ఎక్కడ జరిగింది..? ఏంటి అనే పూర్తి వివరాల్లోకి వెళితే...

British Airways: విమానం గాల్లో ఉండగా చేయకూడని పని.. పైలట్‌పై వేటు
British Airway Pilot Open Door

Updated on: Aug 19, 2025 | 7:50 AM

విమానం పైలట్ తన హోదాను దుర్వినియోగం చేస్తే అది విమానంలో కూర్చున్న ప్రయాణీకులందరి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.. కానీ అలాంటి సంఘటన బ్రిటన్ నుండి వెలుగులోకి వచ్చింది. ఇది దిగ్భ్రాంతికరం మాత్రమే కాదు. విమాన ప్రయాణంలో భద్రత గురించి కూడా ఆందోళనలు లేవనెత్తుతున్నాయి. బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఒక పైలట్ విమాన ప్రయాణంలో కాక్‌పిట్ తలుపు తెరిచి ఉంచాడు. అలా ఓపెన్ చేసి ఉంచడం ఉగ్రవాద నిరోధక చట్టాలను ఉల్లంఘించాడు.

కానీ అతను పొరపాటున అలా చేయలేదు.. ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి పనిచేశాడు. ఎందుకంటే అతను తన కుటుంబ సభ్యులకు విమానాన్ని నడుపుతున్నానని చూపించాలనుకున్నాడు. లండన్‌లోని హీత్రో నుండి న్యూయార్క్ వెళ్తున్న విమానంలో పైలట్ చేసిన పని విమానంలో కూర్చున్న ప్రయాణికులందరినీ భయపెట్టింది. ఎందుకంటే ఇది నిబంధనలను ఉల్లంఘించడమే కాదు, ప్రయాణీకుల జీవితాలతో ఆడుకున్నట్లు కూడా అవుతుంది.

కాక్‌పిట్ తలుపు తెరిచి ఉంచిన పైలట్ చర్య ప్రయాణికులతో పాటు సిబ్బందిని కూడా ఆందోళనకు గురిచేసింది. ‘కాక్‌పిట్ తలుపు తెరిచి ఉందని సిబ్బంది, ప్రయాణీకులు వెంటనే గమనించి, ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నారు. ఇది ప్రయాణీకులను చాలా అసౌకర్యానికి గురిచేసింది. తలుపు చాలా సేపు తెరిచి ఉంది. బ్రిటిష్ ఎయిర్‌వేస్ సహోద్యోగులు కూడా చాలా ఆందోళన చెందారు. బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమాన సిబ్బంది పైలట్ చర్యల గురించి ఎయిర్‌లైన్‌కు సమాచారం అందించారు. ఆ తర్వాత అతన్ని సస్పెండ్ చేశారు. ఈ సంఘటనపై పౌర విమానయాన అథారిటీ తక్షణ దర్యాప్తు ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి

నివేదికల ప్రకారం, పైలట్ విమానాన్ని నడపడంలో విఫలమవడం వల్ల ఆగస్టు 8న UK రాజధానిలో ల్యాండ్ కావాల్సిన న్యూయార్క్ నుండి లండన్‌కు తిరుగు ప్రయాణాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. దీని కారణంగా, బ్రిటిష్ ఎయిర్‌వేస్ ప్రయాణీకులను లండన్‌కు పంపడానికి ప్రత్యామ్నాయ విమానాలను అందించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..