ఆధునిక కాలంలో వివాహ కార్యక్రమాల్లో చిత్ర విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వధూవరులు తమ వివాహాన్ని అందరికంటే భిన్నంగా జరుపుకోవాలని తాపత్రయపడుతూ అందుకు రకరకాల పద్ధతులను అనుసరిస్తున్నారు. వాటికి సంబంధించిన వీడియోలను నెట్టింట పోస్ట్ చేస్తూ వాటి వ్యూస్‌ని చూసుకొని మురిసిపోతున్నారు. నెటిజన్లు కూడా ఇలాంటివాటిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఓ వధువు పెళ్లివేదకపైకి ఎంట్రీ ఇస్తున్న వీడియో నెట్టింట తెగ నవ్వులు పూయిస్తోంది.
ప్రతి వధూవరులు తమ వివాహం ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. డిఫరెంట్ గా జరిగే పెళ్లిళ్లను ప్రజలు చాలా కాలం పాటు గుర్తుంచుకుంటారు.. చర్చించుకుంటారు. ఇందుకోసం దంపతులు కూడా రకరకాల పద్ధతులను పాటిస్తున్నారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక వధువు పెళ్లి వేదిక వద్దకు వచ్చిన సన్నివేశం నవ్వు తెప్పించే విధంగా ఉంది. వధువు వివాహ దుస్తుల్లో అందంగా అలంకరించుకుని ఉంది. ఈ నవ వధువుని లగేజీ ట్రాలీ మీద తోసుకుని వస్తున్నారు. ఈ వీడియో చూస్తే మీకు నవ్వు వస్తుంది.. కానీ వధువు ఇలా ట్రాలీ మీద వస్తుండగా.. ముఖంలో భయం స్పష్టంగా కనిపించింది.
వధువు ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తుండగా, పెళ్లికూతురును ట్రాలీమీద నిలబెట్టి సోదరులు తోకుంటూ తీసుకొచ్చారు. ఇలా ఆమె సోదరులు ఎంజాయ్ చేయడం వీడియోలో మీరు చూడవచ్చు. వైరల్ అవుతున్న ఈ వీడియోను మళ్లీ మళ్లీ చూడవచ్చు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఈ వీడియోను priyanka.indoria1’s అనే Instagramలో షేర్ చేశారు. ఇప్పటికే 23 వేల మందికి పైగా లైక్ చేయగా.. అనేక కామెంట్స్ ను సొంతం చేసుకుంది ఈ వీడియో. వాట్ ఏ కూల్ ఎంట్రీ.’ ‘ప్రేమ, ఆనందం అగ్రస్థానంలో ఉన్నాయి, ‘ఇదంతా బాగానే ఉంది, కానీ ఏ సోదరుడు తన సోదరిని ఈ విధంగా పెళ్ళివేడుక కోసం తీసుకుని వెళ్తాడు.. అంటూ రకరకాల కామెంట్స్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..