Viral Video: పెళ్లి అనేది ప్రతీ మనిషి జీవితంలో ఎంతో కీలకమైంది. వందేళ్ల జీవితమనే ప్రయాణంలో వివాహం ఒక మలుపులాంటిది. అందుకే ప్రతీ ఒక్కరూ తమ వివాహాన్ని ఓ వేడుకగా జరుపుకోవాలని భావిస్తారు. అందుకు అనుగుణంగానే తమ స్థాయికి తగ్గట్లు వైభవంగా జరుపుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అందులోనూ నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆ సంతోషానికి అవధులే ఉండవు. మనసును దోచుకున్న భాగస్వామి తమ జీవితంలోకి అడుగు పెడుతున్న సమయంలో పట్టరాని సంతోషంతో ఉంటారు.
అయితే ఈ సంతోషాన్ని వ్యక్తపరిచే సమయంలో నూతన వధూవరులు కాస్త డిప్లమసీ మెయింటెన్ చేస్తారు. తమ మనసులో ఎంత సంతోషం ఉన్నా.. బయటకు కనిపించకుండా ముసి ముసి నవ్వులు నవ్వుతుంటారు. కానీ ఓ వధువు మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా వ్యవహరించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఓ జంట అగ్ని సాక్షిగా ఒక్కటయ్యారు.
Never seen such a super excited bride ? pic.twitter.com/EAvM24ANtE
— Dr Durgaprasad Hegde (@DpHegde) September 17, 2022
వరుడు, వధువుకు తాళి కడుతోన్న సమయంలో వధువు సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. బిగ్గరగా నవ్వుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. అంతటితో ఆగకుండా నచ్చిన వరుడిని గట్టిగ హగ్ చేసుకొని, బుగ్గపై ముద్దు పెట్టేసింది. దీంతో వివాహ వేడుకకు హాజరైన కుటుంబసభ్యులంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..