Viral: వారంలో పెళ్లి అనగా.. వరుడితో లేచిపోయిన వధువు.. కారణం తెలిస్తే మైండ్ బ్లాంకే!
ఇంకో వారంలో పెళ్లి ఉందనగా కుటుంబ సభ్యులకు తెలియకుండా కాబోయే వరుడితో కలిసి లేచిపోయింది ఓ వధువు.
ఇంకో వారంలో పెళ్లి ఉందనగా కుటుంబ సభ్యులకు తెలియకుండా కాబోయే వరుడితో కలిసి లేచిపోయింది ఓ వధువు. ఆమె అసలెందుకు ఇలా చేసిందో.? అందుకు గల కారణమేంటో తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ కావడం ఖాయం.
వివరాల్లోకి వెళ్తే.. మరో వారం రోజుల్లో తన పెళ్లి ఉందనగా.. ఎవ్వరికీ తెలియకుండా తనకు కాబోయే వరుడితో లేచిపోయింది ఓ యువతి. లేచిపోవడమే కాదు.. అనుకున్న పెళ్లి ముహూర్తానికి ముందే తనకు కాబోయే భర్తతో ఏడడుగులు నడిచేసింది సదరు యువతి. ఇలా చేయడానికి కారణం లేకపోలేదు. తన సోదరి.. తనకు కాబోయే భర్తకు ప్రపోజ్ చెయ్యబోతోందని తెలుసుకున్న ఈ యువతి.. ఇలా షాకింగ్ నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక్కడ ఇంకో గమ్మతైన విషయమేంటంటే.. ఈ విషయాన్ని ఆ యువతి స్వయంగా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంది. అంతేకాదు.. తన భర్తతో కలిసి హనీమూన్‌కు వెళ్లే డేట్‌ను కూడా ప్రకటించింది.
‘నా పెళ్లి జరగబోయే రోజున.. నాకు కాబోయే భర్తకు నా సోదరి ప్రపోజ్ చేయాలనుకుంది. ఈ విషయం వరుడికి అస్సలు తెలియదు. మా కుటుంబసభ్యులు పెళ్లి రోజున అతడ్ని సర్‌ప్రైజ్ చేయాలనుకున్నారు. అయితే నాకు ఎప్పుడైతే ఇది తెలిసిందో.. కాబోయే భర్తతో కలిసి ఓ ప్లాన్ వేసి.. అక్కడ నుంచి వచ్చేశాం. మా ఫ్రెండ్స్, కొద్దిపాటి బంధువులు, అత్తమామల సమక్షంలో మేమిద్దరం ఒకటయ్యాం‘. అని ఆ యువతి రెడిట్‌లో రాసుకొచ్చింది. తన చెల్లిపై కోపంతో ఈ నిర్ణయం తీసుకోలేదని ఆమె తెలిపింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..