Viral Video: అయ్యయ్యో.. రసగుల్లా ఎంత పనిచేసింది.. వేదికపైనే వరుడికి ముద్దు పెట్టిన మరదలు..! షాక్‌లో వధువు

|

Jul 30, 2022 | 6:40 AM

వివాహ వేడుకలో మరదళ్లు ఏదో ఒక సాకుతో వరుడిని ఆటపట్టిస్తుంటారు. వరుడిని ఇబ్బంది పెట్టడం, బూట్లు దొంగిలించడం.. ఇంకా స్వీట్లు తినిపించే సమయంలో సరదాగా ఆటపట్టించడం ఇలా చాలానే జరుగుతుంటాయి.

Viral Video: అయ్యయ్యో.. రసగుల్లా ఎంత పనిచేసింది.. వేదికపైనే వరుడికి ముద్దు పెట్టిన మరదలు..! షాక్‌లో వధువు
Viral Video
Follow us on

Bride Groom viral video: వివాహ వేడుకలకు సంబంధించిన అనేక వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి. వీటిని చూస్తూ నెటిజన్లు తెగ నవ్వుకుంటుంటారు. తాజాగా ఓ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. సాధారణంగా పెళ్లి వేడుక సందడి సందడిగా ఉంటుంది. పెళ్లిలో అత్యంత ఆహ్లాదకరమైన విషయం ఏదైనా ఉందంటే..? అది మరదలు.. వరుడు మధ్య జరిగే సరదా సన్నివేశాలు.. వివాహ వేడుకలో మరదళ్లు ఏదో ఒక సాకుతో వరుడిని ఆటపట్టిస్తుంటారు. వరుడిని ఇబ్బంది పెట్టడం, బూట్లు దొంగిలించడం.. ఇంకా స్వీట్లు తినిపించే సమయంలో సరదాగా ఆటపట్టించడం ఇలా చాలానే జరుగుతుంటాయి. అదే సమయంలో వరుడు కూడా ఏమాత్రం తగ్గకుండా మరదళ్ల అల్లరికి చెక్ పెడుతుంటాడు. ఇలాంటి సరదా సన్నివేశాల్లో అల్లరితనం పెచ్చిమీరితే గొడవలు కూడా అవుతాయి. తాజాగా.. మరదలు అనుకోకుండా తనకు కాబోయే బావను ముద్దుపెట్టుకుంది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వధూవరులు వేదికపై కూర్చోగానే కొంత మంది అమ్మాయిలు అక్కడికి చేరుకోవడాన్ని మనం వీడియోలో చూడవచ్చు. వారంతా కూడా బావను ఆటపట్టించడానికి సిద్ధమైనట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలో ఓ మరదలు తనకు కాబోయే బావకి రసగుల్లాను తినిపించడానికి ముందుకు వస్తుంది. మరదలు తన చేతిలో రసగుల్లాను పట్టుకొని.. వరుడికి తినపించే క్రమంలో ఆటపట్టించడానికి ప్రయత్నిస్తుంది. రసగుల్లా తినిపించడానికి మరదలు చేయి చాచగానే వరుడు.. ఆమె చెయ్యి పట్టుకుని తనవైపు లాక్కున్నాడు. వరుడు రసగుల్లా తినేందుకు ప్రయత్నించే క్రమంలో ఆ అమ్మాయి.. చేతిని వెనక్కి లాక్కుంటుంది. వరుడి నోటికి రసగుల్లా అందకుండా తాను తినేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఊహించని ట్విస్ట్ జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి.. 

రసగుల్లా తినే పోరాటంలో మరదలు.. వరుడు అనుకోకుండా ముద్దు పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. ఈ సన్నివేశాన్ని చూసి అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. వధువు కూడా ఈ సన్నివేశాన్ని చూసి షాకైంది. కానీ ఇది తప్పుగా ఏం అనిపించడం లేదు. అనుకోకుండా జరిగిన ఈ సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను bhutni_ke_memes అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. చాలామంది వీక్షించి పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి