శవ పెటికలో “పెళ్లి కూతురు’..! అవాక్కైన అతిథులు..!

పల్లకిలో పెళ్లి కూతురి ఊరేగింపు చూస్తుంటాం..మరికొందరు పూలతో అలంకరించిన గంపలో వధువును తీసుకొని రావడం చూసి ఉంటాం. ఇంకా కొన్ని ప్రాంతాల్లో గుర్రంపై ఊరేగిస్తూ..పెళ్లికూతుర్ని మండపానికి తొడ్కోని వస్తారు..అంతేగానీ, చచ్చాక మోసుకెళ్లే శవపేటికలో నవ వధువు ఊరేగడం ఎప్పుడు, ఎక్కడా చూసి ఉండరు కాదా.  కానీ,.. ఘానా దేశంలో జరిగిన ఓ పెళ్లిలో మాత్రం వధువు శవపెటికలో పడుకుని ఊరేగింపుగా పెళ్లి మండపానికి వచ్చింది. అది చూసినా పెళ్లి వారంతా ఆశ్చర్యంతో నవ్వుకున్నారు. తొలుత పెళ్లి మండపానికి […]

శవ పెటికలో పెళ్లి కూతురు'..! అవాక్కైన అతిథులు..!
Follow us
Pardhasaradhi Peri

| Edited By: Srinu

Updated on: Nov 22, 2019 | 8:31 PM

పల్లకిలో పెళ్లి కూతురి ఊరేగింపు చూస్తుంటాం..మరికొందరు పూలతో అలంకరించిన గంపలో వధువును తీసుకొని రావడం చూసి ఉంటాం. ఇంకా కొన్ని ప్రాంతాల్లో గుర్రంపై ఊరేగిస్తూ..పెళ్లికూతుర్ని మండపానికి తొడ్కోని వస్తారు..అంతేగానీ, చచ్చాక మోసుకెళ్లే శవపేటికలో నవ వధువు ఊరేగడం ఎప్పుడు, ఎక్కడా చూసి ఉండరు కాదా.  కానీ,.. ఘానా దేశంలో జరిగిన ఓ పెళ్లిలో మాత్రం వధువు శవపెటికలో పడుకుని ఊరేగింపుగా పెళ్లి మండపానికి వచ్చింది. అది చూసినా పెళ్లి వారంతా ఆశ్చర్యంతో నవ్వుకున్నారు. తొలుత పెళ్లి మండపానికి శవ పేటికను తెస్తున్నారేంటని అతిథులంతా ముక్కున వేలేసుకున్నారు. తీరా చూస్తే..అందులోంచి పెళ్లి కూతురు నవ్వుతూ దిగడాన్ని చూసి షాకయ్యారు. ఈ పెళ్లి ఎప్పుడు జరిగిందో తెలీదు..కానీ, దీనికి సంబంధించిన కేరింతలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పెళ్లి కూతురును పెళ్లి వేదిక వద్దకు తీసుకొచ్చే ముందు.. ఆమెను శవ పేటికలో ఉంచారు. తరువాత దానిపై నల్లని వస్త్రాన్ని పరిచారు. కొద్ది సేపటి తర్వాత వధువరుల కేరింతల మధ్య ఆ నల్ల వస్త్రాన్ని తొలగించారు. పెళ్లి కూతురు ఆ శవ పేటిక నుంచి బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్‌ కావడంతో నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.