Watch Video: వివాహ వేదికపైనే హుక్కా తాగుతూ ముద్దులు.. వధూవరులు చేసిన వెర్రిచేష్టలపై నెటిజన్ల మండిపాటు
తమ పెళ్లి గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఏదేదో చేసి అందరిలో నవ్వుల పాలవుతున్నారు కొందరు వధూవరులు . తాజాగా అలాంటి వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది.
మన దేశంలో పెళ్లి వేడుకలకు ప్రత్యేక స్థానముంది. హంగు, ఆర్భాటాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. శుభలేఖల నుంచి విందులు, వినోదాల దాకా ప్రతి అంశంలోనూ తమ ప్రత్యేకత చాటుకోవాలని చాలామంది భావిస్తారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియా యుగం నడుస్తోంది. లైక్స్, వ్యూస్, షేర్ల కోసం కొందరు వెర్రివేషాలు వేస్తున్నారు. వెంటనే వైరల్ అయిపోవాలి..ఏదైనా క్రేజీగా ఉండాలంటూ పిచ్చి పనులు చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలోఇలాంటి తలతిక్కపనులు మరీ ఎక్కువవుతున్నాయి. తమ పెళ్లి గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఏదేదో చేసి అందరిలో నవ్వుల పాలవుతున్నారు కొందరు వధూవరులు . తాజాగా అలాంటి వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. ఓ నూతన జంట వివాహ వేదికపైనే హుక్కా తాగుతూ ముద్దులు పెట్టుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదెక్కడ జరిగిందో తెలియదు కానీ నూతన వధూవరులు చేసిన పిచ్చి పనిపై అందరూ మండి పడుతున్నారు.
వైరల్ అవ్వడానికి ఇన్ని వెర్రి వేషాలా?
ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోన్న ఈ వీడియోలో ముందుగా.. అందరి ముందే హుక్కా పీల్చుతుంది వధువు. ఆతర్వాత వరుడికి లిప్ కిస్ ఇచ్చింది. వరుడి నోట్లో నోరు పెట్టి పొగను ఊదింది. అనంతరం వరుడు మళ్లీ ఆ పొగను బయటకి వదిలాడు. పెళ్లికి వచ్చిన వారిలో ఓ వ్యక్తి దీన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. అంతే ఒక్కసారిగా ఈ వీడియో వైరల్‌గా మారింది. అదే సమయంలో ఆ జంటపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ‘వైరల్ అవ్వడానికి ఇన్ని వెర్రి వేషాలా’, ‘పెళ్లికుండే పవిత్రతను దెబ్బతీస్తున్నారు’ అంటూ నూతన జంటపై నెటిజన్లు మండిపడుతున్నారు.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..