అసలే పరీక్షల కాలం.. అటు కేంద్రం, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాల జాతర నడుస్తోంది. ఉద్యోగార్థులు ఈసారి ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని గట్టి పట్టుదలతో తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, ఈ కాంపిటీవ్ ఎగ్జామ్స్‌లో నెగ్గాలంటే.. ముఖ్యంగా గణితంలో ఆరితేరి ఉండాలి. ఎందుకంటే.. ఎగ్జామ్స్‌లో ఎక్కువగా లాజికల్ రీజనింగ్స్, మ్యాథమెటిక్స్ నుంచి ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి. ఇవి చిన్నవే అయినా, చాలా లాజిక్‌గా ఉంటాయి. అంతే లాజిక్‌గా ఆలోచిస్తే గానీ ఆన్సర్ చేయలేరు. ఈ నేపథ్యంలోనే.. మీ థింకింగ్ లెవెల్స్‌ని మరింత పెంచే లక్ష్యంతో మీముందుకు సరికొత్త బ్రెయిన్ టీజర్ ఐక్యూ టెస్ట్ పిక్చర్‌ను తీసుకువచ్చాం. ఇందులో ఒక లాజిక్ దాగుంది. అదేంటో చెబితే.. మీరు నిజంగా గ్రేట్ అనుకోవచ్చు. ఇది మీ బ్రెయిన్ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. అయితే, దీని ఆన్సర్ చెప్పడం అంత ఈజీ కాదండోయ్.. కాస్త గట్టిగా ఆలోచించాల్సి ఉంటుంది. మరి ఇంతకీ ఆ ప్రశ్న ఏంటని ఎదురు చూస్తున్నారా? కింద ఫోటో ఉంది ఓ లుక్కేసుకోండి. ఆన్సర్ కనిపెట్టేయండి. అయితే, ఇక్కడ చిన్న కండీషన్ ఉంది. కేవలం 25 సెకన్లలో ఆన్సర్ చెప్పాలి. అప్పుడే మీ బ్రెయిన్ షార్ప్ అని అర్థం.
పైన ఇచ్చిన ఫోటోలో పిల్లి, కుక్క, ఎలుక, బరువులను ఇవ్వడం జరిగింది. వాటిలో దేని బరువు ఎంత అనేది తేల్చాలి. అదే మీ ముందున్న టాస్క్. ఈ ఫోటోలో నాలుగు జంతువుల బరువుల ప్రమాణాలను ఇవ్వడం జరిగింది. మొదటి నెంబర్‌లో పిల్లి – ఎలుక ల మిశ్రమ బరువు.. రెండవ నెంబర్‌లో కుక్క – ఎలుక మిశ్రమ బరువు, మూడవ నెంబర్‌లో పిల్లి-కుక్క మిశ్రమ బరువు ఉంటుంది. వీటన్నింటినీ ఆధారంగా చేసుకుని నాలుగో నెంబర్‌లో పిల్లి-ఎలుక-కుక్క ఫోటోలను ఇవ్వడం జరిగింది. వాటి బరువు ఎంత అనేది మీరు తేల్చాల్సి ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఆ లాజిక్‌ని కనిపెట్టి మ్యాటర్ ఏంటో తేల్చేయండి.
ఏంటీ.. ఆన్సర్ రాలేదా? మరేం పర్వాలేదు. ఇక్కడ మీకోసమే ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. ఓ లుక్కేసుకోండి.
1. పిల్లి + ఎలుక = 10 కిలోలు
2. కుక్క + మౌస్ = 20 కిలోలు
3: కుక్క + పిల్లి = 24 కిలోలు
1. ఇప్పుడు పిల్లి = 10 KG – ఎలుక మరియు డాగ్ = 20 Kg – ఎలుక
2. ఇప్పుడు 3 నెంబర్‌లోని బరువును కలపాలి. అదెలాంగే..
3. 20 కేజీలు – ఎలుక + 10 కేజీలు – ఎలుక = 24 కేజీలు
4. 30Kg – 24kg = 2 ఎలుకలు
5. 6kg = 2 ఎలుకలు
6. ఒక ఎలుక = 3 కిలోలు
అంటే.. ఒక ఎలుక వచ్చేసి 3 కిలోలు అయితే పిల్లి, కుక్క బరువులు కింద విధంగా ఉన్నాయి.
పిల్లి = 7 కిలోలు
కుక్క = 17 కిలోలు
పిల్లి + కుక్క + ఎలుక = 27 కిలోలు. ఇదీ ఆన్సర్.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..