
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అపర్ణ గురించి తలచుకుంటూ బాధ పడతాడు సుభాష్. ఇలాంటి ఫ్యామిలీలో పుట్టి ఈ తప్పు చేశానా అని చాలా బాధ పడుతున్నాను రా.. అందరి ముందూ ధైర్యంగా నిలబడే హక్కు కూడా లేదు. ఇంట్లో ఎవరైనా తప్పు చేస్తే నిలబడే హక్కు కూడా పోగొట్టుకున్నాను. ఇంకా ఎందుకు బ్రతకాలి అని సుభాష్ అంటే.. కావ్య, రాజ్ సర్ది చెబుతూ ఉంటారు. అమ్మ తప్పకుండా క్షమిస్తుందని రాజ్ అంటాడు. ఆ తర్వాత అపర్ణ దగ్గరకు వెళ్తుంది కావ్య. అపర్ణను లేపి.. మీకేం కాదు.. ధైర్యంగా ఉండండి అని కావ్య అంటే.. నువ్వు నాకు ధైర్యం చెబుతున్నావా అని అపర్ణను అడుగుతుంది.
మీకు ధైర్యం చెప్పే అర్హత నాకు మాత్రమే ఉంది. కొన్నాళ్ల క్రితం ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితుల్లో నేను ఉన్నాను. పెళ్లి రోజు సంతోషంగా ఎంతో ఆశగా నా భర్త కోసం ఎదురు చూస్తే.. ఆయన ఓ బిడ్డను తీసుకుని వచ్చాడు. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? కానీ అప్పుడు మీలా నేను బాధకు గురి కాలేదు. ఎందుకంటే నా భర్త మీద నమ్మకం ఉంది. ఆయన కలలో కూడా తప్పు చేసే మనిషి కాదు అని తెలిసి.. నిలబడ్డాను. ధైర్యంగా ఆ పరిస్థితిని ఎదుర్కున్నా. ఆ నమ్మకం మీకు మావయ్య గారి మీద ఎందుకు లేదు. మీకు పెళ్లై ఎన్నో సంవత్సరాలు అయింది. ఇన్ని ఏళ్లలో మీరు మావయ్యని అర్థం చేసుకుంది ఇంతేనా? అని కావ్య అంటే.. నేను ఆయన్ని మూర్ఖంగా అర్థం చేసుకున్నానా.. కానీ ఆయన నోటితో ఆయనే చెప్పారు. ఆ బిడ్డకు తండ్రి ఆయనే ఉన్నారు. ఇక ఆయన్ని అర్థం చేసుకోవడంలో ఏముందని అపర్ణ అంటుంది. లేదు అత్తయ్యా మావయ్య గారు మిమ్మల్ని మోసం చేసే మనిషి కాదు. కానీ మావయ్య గారు మోస పోకూడదని ఏమీ లేదు కదా.. ఒక తల్లి కన్న బిడ్డను వదిలి పెట్టి ఉండలేదు. మరి ఆ బిడ్డ తల్లి ఉండగలుగుతుంది. అందుకు డబ్బు కూడా తీసుకుంటుంది. ఏదో జరిగింది అత్తయ్యా.. అది తెలుసుకునే వరకూ ఓపిక పట్టండి అని అపర్ణ అంటే.. నువ్వు నాకు ఏమీ చెప్పకు. నేను ఎప్పటికీ నమ్మను అని అపర్ణ స్పృహ కోల్పోతుంది.
ఆ తర్వాత రుద్రాణి, రాహుల్‌లు కలిసి మరో ప్లాన్ చేస్తారు. ఆ చిత్ర విషయంలో మన పేర్లు బయటకు రాలేదని సంతోష పడాలో.. లేక అత్తయ్యకు ఏమీ కాలేదని బాధ పడాలో అర్థం కావడం లేదు. ఇంత గొడవ జరిగి తనకు హార్ట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత కూడా అత్తయ్య చనిపోలేదంటే గట్టి పిండమే అని రాహుల్ అంటాడు. రేయ్ ఏం మాట్లాడుతున్నావ్ అని రుద్రాణి షాక్ అవుతుంది. అత్తయ్య చనిపోయి ఉంటే.. రాజ్, సుభాష్‌లు డిప్రెషన్‌లో ఉండేవారు. దాంతో మన పని ఈజీ అయిపోయేదని రాహుల్ అంటే.. రేయ్ ఈ ఇంట్లో ఎన్ని గొడవలు జరిగినా.. మా వదిన ఎప్పుడూ నన్ను ఇంట్లోంచి వెళ్లిపొమ్మని అనలేదు రా.. మా వదిన చాలా మంచిది. మా అన్నయ్య పిచ్చి మాలోకం. సర్లే ఏం చేస్తాం కన్న కొడుకు భవిష్యత్తు కంటే ఇంకేం ముఖ్యం కాదులే. ఏదో ఒకటి చేసి మా వదినను సాగనంపేస్తా అని రుద్రాణి అంటుంది. సరే నువ్వు అటు ఆఫీసు పనులు చూసుకో అని.. నేను మా వదిన సంగతి చూస్తాను అని రుద్రాణి అంటుంది.
కట్ చేస్తే.. ఆస్పత్రిలో డాక్టర్ వచ్చి ఏమ్మా రాత్రి మీ అత్తగారికి ఏం మెడిసిన్ ఇచ్చావ్? మీ వైఫ్ మీ అమ్మ గారితో మాట్లాడి నార్మల్ స్టేజ్‌కి తీసుకొచ్చింది. ఆవిడను చూసుకోవడానికి ఓ నర్స్‌ని ఇంటికి పంపిద్దాం అనుకున్నా. ఇప్పుడు ఆ అవసరం లేదు. కోడలు పక్కన ఉంటే ఆవిడ రెండు రోజుల్లో లేచి తిరుగుతుంది. పేషెంట్‌ని ఇంటికి పంపిస్తాం. అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి. ఇది సడెన్ ఎటాక్.. కాబట్టి ఆవిడకి అలాంటి షాకింగ్ న్యూసులు చెప్పకండని డాక్టర్ చెబుతుంది. దీంతో సుభాష్, రాజ్, కావ్యలు హ్యాపీ ఫీల్ అవుతారు.
ఆ తర్వాత అప్పూ బయట కూర్చుని ఉంటుంది. అప్పుడే కనకం, కృష్ణ మూర్తిలు వచ్చి.. మాట్లాడినా ఏమీ మాట్లాడకుండా అప్పూ ఉంటుంది. ఏంటే ఏం ఆలోచిస్తున్నావ్? అని కనకం అంటే.. కావ్య అక్కడ గురించి అని చెబుతుంది. దీంతో జరిగిన దంతా అప్పూ చెబుతుంది. దీంతో కనకం కంగారు పడుతుంది. నెక్ట్స్ అపర్ణను ఇంటికి తీసుకొస్తారు. అందరూ సంతోష పడతారు. ఇక నుంచి దేని గురించి కూడా పట్టించుకోకు. నీకు సంబంధించిన అన్నీ నేనే చూసుకుంటాను. ఇక నుంచి ఇంట్లో ఎవరూ గొడవ పడకండి అని రాజ్ చెప్తాడు.
అది నిజమే కానీ.. వదిన ప్రశాంతంగా ఎలా ఉంటుంది? జరిగింది మామూలు విషయమా? అంత సులువుగా ఆ విషయాన్ని ఎలా వదిలేస్తాం. పనిలో పనిగా ఆ విషయం కూడా తేల్చేయాలి. ఆ బిడ్డ తల్లి ఎక్కడ ఉందో చూసుకోవాలి. సడెన్‌గా ఊడిపడి అన్నయ్య భార్యగా ఉంటానంటే.. బాబుకు వారసత్వం కల్పించాలి అంటే.. వదినకు ఈ వయసులో సవతి పోరు అవసరమా? అని రుద్రాణి అంటుంది. నిన్ను అసలు ఏం అనాలో కూడా అర్థం కావడం లేదని ప్రకాశం అంటాడు. ఆ తర్వాత అందరూ గడ్డి పెడతారు. కళ్యాణ్ కాశీ, రామేశ్వరం ఎక్కడికో ఒక దగ్గరకు అత్తకి టికెట్ బుక్ చేయి. అప్పుడన్నా ఇంటికి రాకుండా ఉంటుందని రాజ్ అంటాడు. తప్పు అన్నయ్య చేస్తే.. అంతా కలిసి నా మీద దుమ్మెత్తి పోస్తున్నారేంటి? అని రుద్రాణి అంటే.. కావ్య రుద్రాణి గారూ అని గట్టిగా అరుస్తుంది. దీంతో ఇక ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.