ఏదో మాట వరుసకు మనం చాలా సార్లు గాడిద గుడ్డు అనే పదం వాడుతుంటాం.. కానీ, గాడిదలు గుడ్డుపెట్టవని మనందరికీ తెలిసిందే. కానీ, మనిషి గుడ్డు పెడతాడని వింటే మీరు కూడా షాక్ అవుతారు..? అయితే ఓ కుర్రాడు అకస్మాత్తుగా గుడ్లు పెట్టడం మొదలుపెట్టాడు. 14 ఏళ్ల ఇండోనేషియా కుర్రాడు అక్మల్.. తాను కోడిపిల్లలా గుడ్లు పెడతానని పేర్కొన్నాడు. ఈ కారణంగా అతని ఆరోగ్యం క్షీణించడంతో చాలాసార్లు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అక్మల్ గుడ్డు పెట్టే సామర్థ్యాన్ని చూసి వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే మానవ శరీరం సాధారణంగా గుడ్డుగా మారదు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, దీని వెనుక ఉన్న కారణాలు వైద్యులకు కూడా అంతుచిక్కకున్నాయి.
ఇండోనేషియాకు చెందిన అక్మల్ కొన్నేళ్ల క్రితం తొలిసారి గుడ్లు పెట్టాడు. ఆ తర్వాత రెండేళ్లలో దాదాపు 20 గుడ్లు పెట్టాడు. అక్మల్ గుడ్లు పెట్టడం చూసి అక్మల్ కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యపోయి చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కూడా అక్మల్ మరో రెండు కోడిగుడ్లను ఆస్పత్రికి అందించాడు. అది చూసి డాక్టర్ కూడా కంగారు పడ్డాడు. చిన్నారి ఫుల్‌బాడీని ఎక్స్‌రే తీసిన వైద్యులు… పిల్లాడి శరీరంలో గుడ్లు ఉన్నాయని తేల్చారు. అయితే ఈ గుడ్లు సరిగ్గా ఎక్కడ నుండి వచ్చాయి అనే ప్రశ్నకు వైద్యులు కూడా సమాధానం వెతుకుతున్నారు.
ఇండోనేషియాలోని సౌత్ సులవేసి నివాసి అయిన అక్మల్‌ను అతని తండ్రి సాయిక్ యూసుఫ్ ఆసుపత్రికి తరలించారు. అక్మల్ గుడ్లు పెడుతున్నాడని విని డాక్టర్ కూడా ఆశ్చర్యపోయాడు. తొలుత డాక్టర్ కూడా నమ్మలేకపోయాడు. డాక్టర్ అబ్జర్వేషన్‌లో ఉంచడంతో అతను ఆసుపత్రిలో డాక్టర్ ముందు 2 గుడ్లు పెట్టాడు. వైద్యుడు ఈ గుడ్డును పరిశీలించగా.. అది మనిషి శరీరంలోని కోడి గుడ్డు అని తేలింది. కానీ, సహజంగా గుడ్లు పెట్టే సామర్థ్యం మనుషులకు లేదు. కాబట్టి, ఈ గుడ్లు అక్మల్ శరీరంలోకి ఎలా చేరాయనేది ప్రశ్న. మానవ శరీరంలో గుడ్డు ఏర్పడటం అసాధ్యం. 2016 నుంచి గుడ్లు పెడుతున్న ఈ బాలుడు.. డాక్టర్ ముందు 2 గుడ్లు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఈ వార్త సోషల్ మీడియాలో వ్యాపించడంతో ప్రజలు దీనిపై రకరకాలుగా స్పందించడం ప్రారంభించారు. అక్మల్ శరీరం లోపల గుడ్డును నిక్షిప్తం చేసేవాడని అంటే దానిని మింగేసి మలద్వారం ద్వారా బయటకు పంపేవాడని కొందరు అంటున్నారు. అయితే ఏది ఏమైనా ఇలాంటి ఇబ్బందులు ఎవరు భరిస్తారనే ప్రశ్న కూడా తలెత్తింది. అయితే, ఈ 2018లో వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఈ వార్త బాగా పాపులర్ అయింది. ఇప్పుడు మళ్లీ ఈ వార్త ఇంటర్నెట్, సోషల్ మీడియా కారణంగా మరోమారు వైరల్ అవుతుంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..