ప్రేమ లేదు తొక్క లేదు.. అబ్బాయిలూ భద్రం..! ప్రియుడిని రూ. 11 లక్షలకు అమ్మేసిన కిలేడీ.. ఎక్కడంటే
గత కొద్ది రోజులుగా భార్యల చేతిలో భర్తలు దారుణ హత్యకు గురవుతున్న సంఘటనలు వరుసగా చూస్తున్నాం. ఈ క్రమంలోనే తాజాగా మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక ప్రియురాలు తన ప్రియుడిని సైబర్ ముఠాకు అమ్మేసింది. అవును, 17 ఏళ్ల అమ్మాయి చైనా నుండి 19 ఏళ్ల అబ్బాయిని మయన్మార్ కు రప్పించింది. ఆ తర్వాత ఆమె అతన్ని సైబర్ స్కామర్ల ముఠాకు అమ్మేసింది. ఇందుకు గానూ ఆ అమ్మాయికి 10 వేల పౌండ్లు (సుమారు 11 లక్షల రూపాయలు) సైబర్ ముఠా నుండి తీసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

చైనాకు చెందిన 17 ఏళ్ల అమ్మాయి తన ప్రియుడిని మయన్మార్‌లోని సైబర్ క్రైమ్ ముఠాకు 10 వేల పౌండ్లకు అంటే 11 లక్షల రూపాయలకు అమ్మేసింది. అక్కడ ఆ అబ్బాయిని వారు చాలా హింసించారు. ప్రజలను మోసం చేయమని బలవంతం చేశారు. నివేదిక ప్రకారం.. చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని ఝాంజియాంగ్‌కు చెందిన 19 ఏళ్ల యువకుడిని తన 17 ఏళ్ల ప్రియురాలు మోసం చేసింది. అతన్ని మయన్మార్‌కు చెందిన ఆన్‌లైన్ స్కామర్ ముఠాకు విక్రయించింది. మయన్మార్‌లోని సైబర్ క్రైమ్ ముఠా ఆ యువకుడిని చాలా హింసించింది. వారి చిత్రహింసలకు అతని బరువు డజన్ల కొద్దీ పౌండ్లు తగ్గింది. అతనికి వినికిడి శక్తి కూడా తగ్గిపోయింది. తరువాత అతను తిరిగి రావడానికి కుటుంబం భారీ మొత్తంలో విమోచన క్రయధనం చెల్లించాల్సి వచ్చింది. అప్పుడే అతను ఇంటికి తిరిగి రాగలడు.
కుటుంబం చెప్పిన వివరాల ప్రకారం, సైబర్ మోసగాళ్ళు ఆ యువకుడితో రోజుకు 20 గంటలు పని చేయించేవారని, అలా చేయకపోతే విపరీతంగా కొట్టేవారని చెప్పారు.. బాలుడిని ఆన్‌లైన్‌లో ప్రజలను మోసం చేయమని బలవంతం చేశారు. గత సంవత్సరం ఇద్దరూ బిలియర్డ్స్ హాల్‌లో కలుసుకున్నారని యువకుడి సోదరి చెప్పారు. తన సోదరుడి ప్రియురాలు ఫ్యాషన్‌గా కనిపించడానికి ఇష్టపడేదని, అందుకోసం ఏదైనా చేసేదని చెప్పింది. తాను ఆగ్నేయ చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌కు చెందినవాడినని, తన తల్లిదండ్రులు పెద్ద వ్యాపారవేత్తలని ఆ అమ్మాయి పేర్కొంది. ఆమె కుటుంబం అనేక చోట్ల పెట్టుబడులు పెట్టిందని చెప్పింది. ఆ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌కు మయన్మార్‌లో తన కుటుంబ వ్యాపారం గురించి క్రమం తప్పకుండా చెబుతూ, చివరికి అక్కడ పని చేయటానికి ఒప్పించింది. దీంతో అతను తన కుటుంబానికి తెలియజేయకుండా తన స్నేహితురాలితో కలిసి థాయిలాండ్ వెళ్లి, అక్కడి నుండి మయన్మార్‌కు వెళ్లాడు.
అక్కడే అతన్ని సైబర్ క్రైమ్ ముఠాకు అమ్మేసిందని యువకుడి సోదరి చెప్పింది. అక్కడ అతని ఫోన్, పాస్‌పోర్ట్ లాక్కున్నారు. కంప్యూటర్‌లో రోజంతా ప్రజలను మోసం చేసేలా అతన్ని బలవంతం చేశారు. అతన్ని ఒక చిన్న చీకటి గదికి తీసుకెళ్లి చెవులపై, తుంటిపై ఇనుప రాడ్లతో కొట్టారు. రోజుకు 16 నుండి 20 గంటలు పని చేయమని బలవంతం చేశారు. రోజుల తరబడి ఆకలితో ఉంచారని చెప్పారు. చివరకు సమాచారం తెలియడంతో బాలుడి కుటుంబం 350,000 యువాన్లు (£36,000) చెల్లించింది. అతను ఈ సంవత్సరం జూన్‌లో ఇంటికి తిరిగి వచ్చాడు. యువకుడి ప్రియురాలు థాయిలాండ్‌లో పది రోజుల సెలవు గడిపిన తర్వాత చైనాకు వచ్చినప్పుడు పోలీసులు ఆమెను అరెస్టు చేశారని తెలిసింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




