హఠాత్తుగా నాగుపాము ఎదురైతే ఏం చేయాలో తెలుసా..? ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు..
భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన పాములలో ఇండియన్ కోబ్రా లేదా కింగ్ కోబ్రా (నాగుపాము) ఒకటి. ఇవి అడవులు, పొదలు, పొలాల్లోనే కాదు నగరాల్లో కూడా కనిపిస్తాయి. వాటి తలను చూడగానే ప్రజలు భయంతో పరుగులు తీస్తుంటారు. కానీ, అవి అస్సలు దూకుడుగా ఉండవని నిపుణులు చెబుతున్నారు. మీ ఇంట్లో లేదా పార్కులో లేదా సమీపంలో ఏదైనా పాము కనిపిస్తే దాని చుట్టూరా గుంపుగా గుమికూడవద్దు. శబ్దం చేయడం వల్ల పాము

మనదేశంలో పాముల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా గ్రామాలు, పల్లె ప్రాంతాల్లో పాములు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇక వర్షాకాలంలో ఈ పాముల బెడద మరీ ఎక్కువగా ఉంటుంది. భారీ వర్షాలు, వరదల కారణంగా పొదలు, బొరియాల్లో దాగివున్న పాములు బయటకు వస్తుంటాయి. ఆహారం, వెచ్చదనం వెతుక్కుంటూ తరచూ ఇళ్లలోకి కూడా ప్రవేశిస్తుంటాయి. అలా పామును చూస్తే చాలా మంది భయంతో వణికిపోతుంటారు. దూరంగా పారిపోతుంటారు. కానీ, అలా వేగంగా పారిపోలేని పరిస్థితుల్లో అకస్మాత్తుగా మీకు పాము కనిపిస్తే ఏం చేయాలో తెలుసా..? కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు, సింపుల్ టిప్స్ ఇక్కడ చూద్దాం…
మీరు ఒక నాగుపాముని చూసినట్లయితే, ముఖ్యంగా మన దేశంలో నాగుపాము అంటే దాదాపు అందరూ భయపడతారు. కానీ అలాంటి సమయాల్లో మనం ప్రశాంతంగా ఉండటం, సరైన సమాచారంతో స్పందించడం చాలా ముఖ్యం. మీరు ఒక నాగుపాముని చూసినట్లయితే, ముఖ్యంగా మన దేశంలో, భారతదేశంలో, మీరు చాలా భయపడతారు. కానీ అలాంటి సమయాల్లో, మనం ప్రశాంతంగా ఉండటం మరియు సరైన సమాచారంతో స్పందించడం చాలా ముఖ్యం.
భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన పాములలో ఇండియన్ కోబ్రా లేదా కింగ్ కోబ్రా (నాగుపాము) ఒకటి. ఇవి అడవులు, పొదలు, పొలాల్లోనే కాదు నగరాల్లో కూడా కనిపిస్తాయి. వాటి తలను చూడగానే ప్రజలు భయంతో పరుగులు తీస్తుంటారు. కానీ, అవి అస్సలు దూకుడుగా ఉండవని నిపుణులు చెబుతున్నారు. మీ ఇంట్లో లేదా పార్కులో లేదా సమీపంలో ఏదైనా పాము కనిపిస్తే దాని చుట్టూరా గుంపుగా గుమికూడవద్దు. శబ్దం చేయడం వల్ల పాము ప్రమాదకరంగా మారవచ్చు. మీరు ప్రశాంతంగా ఉండి దాన్ని వెళ్లనివ్వండి. మీకు పాములను పట్టుకోవడం తెలిస్తే, దాన్ని పట్టుకుని దూరంగా విడిచిపెట్టండి..లేదంటే స్నేక్ క్యాచర్‌కి సమాచారం అందించండి.
అనుకోకుండా నాగుపాము ఎదురుపడితే ముందుగా మీరు ప్రశాంతంగా ఉండండి. కదలకుండా నిలబడాలి. భయాందోళన పరిస్థితి అదుపు తప్పేలా చేస్తుంది. మీరు పామును చూసిన వెంటనే భయంతో హడావుడి చేయటం కాదు..పాము పరిస్థితిని అర్థం చేసుకుని తప్పించుకోవడానికి ప్రయత్నించండి. పాము మీ కళ్ళను నేరుగా చూస్తే దాని వల్ల ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీ చూపులను కొద్దిగా తగ్గించి నెమ్మదిగా వెనక్కి తగ్గండి. పాము కదలికలను గమనించండి.
కోబ్రాస్ వాటికి ప్రాణహాని ఉందని తెలిస్తేనే దాడి చేస్తాయి. కాబట్టి, వీలైతే పాము తప్పించుకోవడానికి సరైన మార్గాన్ని అందించండి. చాలా పాములు దాడి చేయడం కంటే పారిపోవడానికి ఇష్టపడతాయి. మీరు పామును చంపడానికి కొట్టడానికి ప్రయత్నిస్తే, పాము కాటుకు గురయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, దానిని వదిలేయండి. లేదంటే పాములు పట్టుకునే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వండి.
నాగుపాముకు ఎంత దూరంగా ఉండాలి:
ఒక నాగుపాము దాని శరీరం పొడవులో మూడింట ఒక వంతు దూరం నుండి దాడి చేయగలదు. కాబట్టి కనీసం 6 నుండి 8 అడుగుల దూరం సురక్షితం.
పాము కాటు వేస్తే ఎలాంటి ప్రథమ చికిత్స ఇవ్వాలి?:
పాము కాటుకు గురైతే వెంటనే వైద్య సహాయం తీసుకోండి. ఆసుపత్రికి చేరే వరకు ఈ చిట్కాలను పాటించండి. భయంతో బిగుసుకుపోకండి. భయం విషాన్ని త్వరగా వ్యాపిస్తుంది. కాటు వేసిన ప్రాంతాన్ని ఎక్కువగా కదిలించవద్దు. బిగుతుగా ఉన్న దుస్తులు, నగలను తొలగించండి. టోర్నీకీట్ వేయవద్దు. సినిమాల్లో హీరోలు చేసినట్టుగా పాము విషాన్ని నోటితో తొలగించే ప్రయత్నం చేయరాదు. గాయానికి ఐస్ లేదా బ్లేడ్ వంటివి టచ్ చేయరాదు. వీలైనంత త్వరగా యాంటీవీనమ్ ఉన్న ఆసుపత్రికి వెళ్లండి.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..




