AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరోయిన్‌లా కనిపించాలంటూ భర్త వేధింపులు.. రోజు 3గంటల టార్చర్.. చివరకు ఆమె ఏం చేసిందంటే..?

హీరోయిన్ దొరక్కపోతే ఏంది..? భార్యనే తమ హీరోయిన్ అనుకుంటారు చాలా మంది. మరికొంతమంది హీరోయిన్లపై మోజు పెంచుకుని భార్యలను చిత్రహింసలు పెడుతుంటారు. హీరోయిన్ లాగా కనిపించాలని వేధింపులకు పాల్పడతారు. తాజాగా యూపీలో అటువంటి ఘటనే జరిగింది. చివరకు భార్య ఏం చేసిందంటే..?

హీరోయిన్‌లా కనిపించాలంటూ భర్త వేధింపులు.. రోజు 3గంటల టార్చర్.. చివరకు ఆమె ఏం చేసిందంటే..?
Husband Harasses Wife To Look Like Nora Fatehi
Krishna S
|

Updated on: Aug 21, 2025 | 8:29 AM

Share

సినీ హీరోయిన్లు అంటే మగవారికి మస్త్ ఇష్టం ఉంటుంది. అందుకే హీరోయిన్ లాంటి మహిళ భార్యగా రావాలని కోరుకుంటారు. కొంతమంది అయితే హీరోయిన్లపై తెగ మోజు పెంచుకుంటారు. హీరోయిన్ లాగా రెడీ అవ్వాలంటూ భార్యను ఇబ్బందులు పెడుతుంటారు. తాజాగా ఇటువంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను బాలీవుడ్ నటి నోరా ఫతేహిలా రెడీ అవ్వాలంటూ వేధించేవాడు. ఆమెలా శరీర ఆకృతిని కలిగి ఉండాలని టార్చర్ పెట్టేవాడు. భర్త వేధింపులు భరించలేని భార్య చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త తనను నోరా ఫతేహిలా కనిపించాలని బలవంతం చేస్తూ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదులో తెలిపింది.

అసలేం జరిగిందంటే..?

బాధితురాలు ఈ ఏడాది మార్చి 6న మీరట్‌కు చెందిన ప్రభుత్వ స్కూల్ టీచర్‌ అయిన శివం ఉజ్వల్‌ను వివాహం చేసుకుంది. ఆమె సాధారణ ఎత్తు, రంగు ఉన్నప్పటికీ.. తన భర్త, అత్తమామలు తన శారీరక రూపాన్ని ఎగతాళి చేసేవారు. పెళ్లి తర్వాత తన జీవితం నాశనమైందని, తనకి నోరా ఫతేహి లాంటి అమ్మాయి కావాలంటూ శివం వేధించేవాడు. నోరా ఫతేహిలా కనిపించడానికి.. రోజుకు మూడు గంటలు వ్యాయామం చేయాలని భర్త తనపై ఒత్తిడి చేసేవాడని భార్య తెలిపింది. ఒకవేళ ఏ రోజైనా మూడు గంటలు వ్యాయామం చేయకపోతే, ఆ రోజు ఆహారం ఇవ్వకుండా వేధించేవాడని ఆరోపించింది.

గర్భస్రావం చేయాలని కుట్రలు..

ఈ వేధింపులే కాకుండా తన భర్త ఇతర మహిళల పట్ల మోజు పడతారని.. సోషల్ మీడియాలో వారి అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలు చూసేవాడని ఆ మహిళ ఆరోపించింది. తాను గర్భవతి అయినప్పుడు తన భర్త రహస్యంగా గర్భస్రావ మాత్రలు ఇచ్చాడని ఆరోపించింది. అంతే కాకుండా అదనపు కట్నం కోసం తన అత్తమామలు కూడా వేధించారని ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లిలో దాదాపు రూ. 76 లక్షలు ఖర్చు చేశామని, ఇందులో రూ. 16 లక్షల విలువైన నగలు, రూ. 24 లక్షల విలువైన మహీంద్రా స్కార్పియో, రూ. 10 లక్షల నగదు ఇచ్చామని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త, అత్త, మామ,వదినపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన సమాజంలో పెరిగిపోతున్న కట్నం వేధింపులుమహిళల పట్ల దారుణమైన ప్రవర్తనకు అద్దం పడుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..