ఈ భూమ్మీద నూకలుండాలే గానీ, మృత్యువు నోట్లో తలపెట్టి బయటపడేవారిని చాలా మందిని చూస్తుంటాం..కొన్ని కొన్ని సందర్భాల్లో అంత్యక్రియల్లో ఆ వ్యక్తి ప్రాణాలతో లేచిన ఉదాంతాలు చూస్తుంటాం. అదే రాసి పెట్టి ఉంటే.. ఇంట్లో మనం ఎంత సురక్షితంగా ఉన్నప్పటికీ మరణం వెంటాడుతుంది. అందుకే మనిషికి చావు అనేది ఏ రూపంలో వస్తుందో కూడా చెప్పలేం.. ఇక్కడ కూడా అలాంటి సంఘటనే జరిగింది. ఓ అపార్ట్‌మెంట్ బయట ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉండగా, మూడో అంతస్తు నుంచి ఏసీ కూలి ఓ వ్యక్తి నిలువునా ప్రాణాలు కోల్పోయాడు..! నమ్మశక్యం కానీ, ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..
వైరల్ వీడియో దేశ రాజధాని ఢిల్లీకి సంబంధించినదిగా తెలిసింది. ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆగస్టు 17న సాయంత్రం 6.50 గంటలకు ఓ అపార్ట్‌మెంట్ ఎంట్రెన్స్‌లో ఇద్దరు యువకులు నిలబడి ఏదో మాట్లాడుకుంటున్నారు. ఆగివున్న స్కూటర్‌పై ఒక యువకుడు కూర్చొని ఉండగా అతడి పక్కగా మరో యువకుడు నిల్చొని ఉన్నాడు. వారిద్దరూ మాటల్లో బిజీగా ఉన్నారు. చుట్టు పక్కల జనాలు కూడా ఎవరి పనుల్లో వారున్నారు. ఇంతలో ఉన్నట్టుండి మూడో అంతస్తు నుంచి ఏసీ ఊడిపడింది. స్కూటర్‌పై కూర్చొని ఉన్న యువకుడి తలపై నేరుగా అది పడటంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. అతడి పక్కనే ఉన్న మరో యువకుడు గాయపడ్డాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యం రికార్డైంది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Deadly incident: Karol Bagh
A tragic incident occurred in Karol Bagh, although the exact date and location are unknown.
A condenser from a split AC fell on a young man, causing instant death.@DelhiPolice pic.twitter.com/Pl7xQy8AE9
— Atulkrishan (@iAtulKrishan1) August 18, 2024
రాజధాని ఢిల్లీలో ఇలాంటి నిర్లక్ష్యపు పనుల కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నెల జూలై 17న ఓల్డ్ రాజిందర్ నగర్‌లోని రావు ఐఏఎస్ స్టడీ సర్కిల్ బేస్‌మెంట్‌లో వరదలు రావడంతో ముగ్గురు కాబోయే ఐఏఎస్‌లు మరణించారు. ఈ సంఘటన విద్యార్థులలో ఆగ్రహానికి దారితీసింది. పౌర ఉదాసీనతకు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో పౌర సేవల అభ్యర్థులు రోడ్డుపైకి వచ్చారు. ఈ సంఘటన తర్వాత, నిబంధనలను ఉల్లంఘించారని తేలింది. ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..