Viral: విపరీతమైన కడుపునొప్పితో ఆస్పత్రికి యువకుడు.. ఎక్స్-రే రిపోర్ట్ చూసి డాక్టర్లు షాక్
కొన్ని తింగరి పనులు ప్రాణాల మీదకి తెస్తాయి. తాజాగా ఓ యువకుడు తన మలద్వారం గుండా బాడీ స్పే బాటిల్‌ను లోపలికి చొప్పించాడు. ఆ తర్వాత ఆ విషయం ఎవరికీ చెప్పకుండా 20 రోజులు గడిపాడు.
West Bengal: ఈ మధ్య డాక్టర్లకు కొన్ని వింత కేసులు ఎదురవుతున్నాయి. మానసిక సమస్యలతో బాధితులు జుట్టు, నట్టులు, బోల్డ్‌లు, చెక్కముక్కలు వంటివి మింగుతున్నారు. ఆ తర్వాత కడుపునొప్పితో ఆస్పత్రికి వస్తున్నారు. తాజాగా అలాంటి కేసే పశ్చిమ బెంగాల్‌లో వెలుగుచూసింది. సౌత్ 24 పరగణాస్‌లోని పాతర్‌ప్రతిమకు చెందిన యువకుడు గత బుధవారం విపరీతమైన కడుపునొప్పితో చికిత్స కోసం బుర్ద్వాన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వచ్చాడు. ఎక్స్-రే తీసిన వైద్యులు స్టన్ అయ్యారు. ఎందుకంటే అతడి కడుపులో బాడీ స్ప్రే బాటిల్ ఉంది. దీంతో వెంటనే రెండు గంటలపాటు అత్యవసర శస్త్రచికిత్స చేసి.. మూతతో సహా దాదాపు ఏడున్నర అంగుళాల పొడవు ఉన్న ఆ బాటిల్‌ను రిమూవ్ చేశారు. శస్త్రచికిత్స విజయవంతం కావడంతో రోగి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. అయితే ఏడు రోజుల పాటు బాధితుడిని అబ్జర్వేషన్‌లో ఉంచుతామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. అయితే యువకుడి అన్నవాహిక, పేగులు కూడా దెబ్బతిన్నాయని చెప్పాలి. భవిష్యత్తులో మళ్లీ ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని వెల్లడించారు.
దాదాపు 20 రోజుల క్రితం.. ఆ డియోడరెంట్ బాటిల్‌ను అతను మలద్వారం గుండా లోనికి చొప్పించాడని ఆసుపత్రి సూపరింటెండెంట్ తపస్ ఘోష్ తెలిపారు. దీంతో గత వారం రోజులుగా అతడికి మల విసర్జన కూడా కష్టంగా మారిందని వెల్లడించారు. ఆస్పత్రికి రావడం కొద్దిగా ఆలస్యం చేసి ఉంటే.. పరిస్థితి చేయి దాటేదని పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి