చిన్నారుల కళ్ల ముందే తల్లిని ఢీకొట్టిన పోలీస్‌ కారు..షాకింగ్‌ వీడియో వైరల్‌.. పిల్లల అరుపులు హృదయవిదారకం..

|

Nov 30, 2024 | 5:41 PM

చిన్నారుల కళ్లముందే ఓ మహిళ దారుణంగా మృతి చెందిన ఉదంతం అమెరికాలో వెలుగుచూసింది. పిల్లలతో కలిసి రోడ్డు దాటుతున్న ఓ మహిళను పోలీసు వాహనం దారుణంగా ఢీకొట్టింది. ఈ షాకింగ్‌ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

చిన్నారుల కళ్ల ముందే తల్లిని ఢీకొట్టిన పోలీస్‌ కారు..షాకింగ్‌ వీడియో వైరల్‌.. పిల్లల అరుపులు హృదయవిదారకం..
Body Camera Video
Follow us on

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని అతిపెద్ద నగరమైన హ్యూస్టన్‌లో ఓ మహిళ ప్రమాదంలో మరణించింది. 41 ఏళ్ల మహిళ తన పిల్లలతో కలిసి రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగింది. రాత్రి 9.52 గంటల సమయంలో పైన్‌మాంట్ సమీపంలో వేగంగా వెళ్తున్న ఓ పోలీసు అధికారి కారు మహిళను ఢీకొట్టింది. సెప్టెంబర్ 19 రాత్రి ఈ ప్రమాదం జరిగింది. పోలీసు అధికారి షెల్బీ కెన్నెడీ ఆంటోనీకి కారు డ్రైవ్‌ చేస్తున్నట్టుగా తెలిసింది. హ్యూస్టన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ కారు డాష్‌క్యామ్, బాడీ కెమెరాలో ఇదంతా రికార్డైంది. రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారుకు అడ్డంగా ఓ మహిళ కారు ముందుకు రావడం వీడియోలో కనిపిస్తోంది.

కారు ఢీకొన్న వెంటనే ఆ మహిళ దూరంగా వెళ్లి పడిపోతుంది. అదే సమయంలో రోడ్డు దాటుతున్న పిల్లలు అరవడం వీడియోలో స్పష్టంగా వినిపించింది. మృతురాలు డిసైరీ పూలేగా గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత రాత్రి 10 గంటలకు పోలీసులకు సమాచారం అందించారు. రోడ్డు మధ్యలో నాలుగో వ్యక్తి నిలబడి ఉండటం కూడా వీడియోలో కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

రోడ్డుపై హై స్పీడ్‌తో వెళ్తున్న కారును చూసిన కుటుంబీకులు దారిలో నుంచి దూరంగా వెళ్లేందుకు ప్రయత్నించడం వీడియోలో కనిపిస్తోంది. కానీ, అప్పటికే ఆ మహిళను కారు ఢీకొట్టింది. దాంతో ఆమె అమాంతంగా ఎగిరి చాలా దూరం పడిపోయింది. ప్రమాదం జరిగిన తర్వాత కారు ఆగి ఉన్న దృశ్యాలు కూడా వీడియోలో కనిపిస్తున్నాయి. మహిళ పిల్లలు ఏడుస్తూ, కేకలు వేస్తూ కనిపించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..