BIZARRE: ఎవరికైనా సమస్య వస్తే వెంటనే ఏదో ఒక పబ్లిక్ హెల్ప్‌లైన్ నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేస్తారు. సమస్య పరిష్కరించమని కోరుతారు. అది పెద్ద సమస్య అయితేనే. లేదంటే వీలును బట్టి ఆ సమస్యను పరిష్కరించుకుంటాం. ఇక్కడ ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం పబ్లిక్ హెల్ప్‌లైన్‌ను సిల్లీ కంప్లైంట్ ఇవ్వడానికి వినియోగించుకున్నాడు. అవును, అదికూడా ఫుడ్డు విషయంలో తాను అడిగింది ఇవ్వనందుకు ఏకంగా ముఖ్యమంత్రి హెల్ప్‌లైన్ నెంబర్‌కే కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చాడు. ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఛతర్‌పూర్ బస్‌స్టాండ్ వద్ద రాకేష్ సమోసా పేరుతో ఒక షాప్ ఉంది. ఆ షాపులోకి వంశ్ బహదూర్ సమోసా కోసం వెళ్లాడు. సమోసా పార్శిల్ చేయమని కోరాడు. దాంతో షాపు వారు అతనికి సమోసా పార్శిల్ చేశారు. అయితే, ఇక్కడే సమస్య వచ్చింది అతనికి. సమోసా ఇచ్చిన షాపు వారు.. తనకు ప్లేట్, స్పూన్స్ ఇవ్వలేదని ఆరోపించాడు. అంతటితో ఆగలేదు.. ఏకంగా సీఎం హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చాడు. ‘ఇక్కడ ఛతర్‌పూర్ బస్‌స్టాండ్ వద్ద రాకేష్ సమోసా షాపులో సమోసా కొనుగోలు చేశాను. సమోసా ఇచ్చారు కానీ, దాంతోపాటు ప్లేట్, స్పూన్స్ ఇవ్వలేదు. మీరు వారిపై చర్యలు తీసుకోవాలి.’ అని హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చాడు వంశ్ బహదూర్. ఆన్‌లైన్‌లోనూ తన కంప్లైంట్‌ను నమోదు చేశాడు.
ఆగస్టు 30న ఈ కంప్లైంట్ చేయగా.. తాజాగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అతనికి మెసేజ్ వచ్చింది. ‘మీరు సీఎం హెల్ప్‌లైన్ పోర్టల్‌లో చేసిన ఫిర్యాదు, సూచనలు పరిష్కరించబడింది’ అని సందేశం అందింది. ఈ కంప్లైంట్, సీఎంవో రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెట్టింట్లో ఇప్పుడిది పెద్ద జోక్‌గా మారింది. ప్లేట్, స్పూన్ కోసం ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడం ఏంటి సామీ అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..