Road Accident: వాయు వేగంతో వచ్చి కారును ఢీకొన్న బైక్.. వీడియో చూస్తే ఒళ్లు జలదరించాల్సిందే

|

Nov 06, 2022 | 9:28 PM

కొద్ది నెలల క్రితం విడుదలైన నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో గణంకాల ప్రకారం.. 2021 సంవత్సరంలో ఒక లక్షా 55 వేల మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఇందులో దాదాపు 70 వేల మరణాలు కేవలం బైక్ ప్రమాదాల్లోనే సంభవించాయి.

Road Accident: వాయు వేగంతో వచ్చి కారును ఢీకొన్న బైక్.. వీడియో చూస్తే ఒళ్లు జలదరించాల్సిందే
Bike Accident
Follow us on

రోడ్డుపై వెళుతున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే ప్రమాదాల బారిన పడటానికి ఎక్కువ సమయం పట్టదు. ఈరోజుల్లో రోడ్లపై వాహనాలు అతివేగంతో వెళుతున్నాయి. దీని కారణంగానే ఏటేటా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. కొద్ది నెలల క్రితం విడుదలైన నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో గణంకాల ప్రకారం.. 2021 సంవత్సరంలో ఒక లక్షా 55 వేల మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఇందులో దాదాపు 70 వేల మరణాలు కేవలం బైక్ ప్రమాదాల్లోనే సంభవించాయి. ఈనేపథ్యంలో అలాంటి బైక్ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూస్తే ఒళ్లు జలదరించాల్సిందే. అంత భయానకంగా ఉందీ యాక్సిడెంట్‌ వీడియో. ఆన్‌లైన్‌లో బాగా వైరలవుతోన్న ఈ వీడియోలో రోడ్డుపై వాహనాలు వస్తూ పోతూ ఉండడం వీడియోలో చూడవచ్చు. అయితే వేగంగా వెళ్తున్న బైక్ రైడర్ నేరుగా వెళ్లి కారును ఢీకొట్టాడు. దీంతో అతని బైక్ గాల్లోకి ఎగిరిపడుతుంది. బైక్ రైడర్ కూడా గాల్లోకి ఎగిరి కింద పడిపోతాడు. కారు కూడా బాగా దెబ్బతింటుంది.  బైక్ రైడర్ కూడా దూకి పడిపోతాడు. ఈ ఘోర ప్రమాదాన్ని ఓ కారు రైడర్ తన కెమెరాలో చిత్రీకరించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిజానికి ఈ రోడ్ యాక్సిడెంట్ చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఈ ప్రమాదంలో బైక్ రైడర్ ప్రాణాలతో బయటపడ్డాడా? లేదా? అనే దానిపై  ఎటువంటి సమాచారం లేదు.

ఎక్కడ జరిగిందో కానీ @ViciousVideos అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో ఈ వీడియోను షేర్‌ చేశారు. దీంతో అది కాస్తా వైరల్‌గా మారింది. వీడియో చూసిన తర్వాత నెటిజన్లు వివిధ రకాల రియాక్షన్లు ఇస్తున్నారు. బైకర్‌ అతి వేగంగా బైక్ నడుపుతున్నాడని కొందరు, ఈ ప్రమాదంలో అతను ప్రాణాలు కోల్పోయి ఉంటాడంటూ కామెంట్లు పెడుతున్నారు. దయచేసి రోడ్డుపై జాగ్రత్తగా వెళ్లాలంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఒళ్లు జలదరించేలా ఉన్న ఈ వైరల్‌ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..