AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కింగ్ కోబ్రాకే చుక్కలు చూపించింది.. కట్టెపుల్ల లెక్క పట్టుకుని ఏం చేసిందో చూడండి.. వీడియో వైరల్..

ఆ ఇంట్లో వాళ్లు ఎప్పటిలాగే తమ పనుల్లో బిజీగా ఉన్నారు. కానీ ఇంట్లోని ఓ మూల నుంచి వింత శబ్దాలు వారిని భయపెట్టాయి. ఏంటా అని దగ్గరికి వెళ్లి చూసిన వారికి గుండెలు అదిరిపోయాయి. బీహార్‌లోని వాల్మీకినగర్‌లో ఒక ఇంట్లోకి చొరబడిన 10 అడుగుల భారీ కింగ్ కోబ్రా అక్కడివారిని హడలెత్తించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: కింగ్ కోబ్రాకే చుక్కలు చూపించింది.. కట్టెపుల్ల లెక్క పట్టుకుని ఏం చేసిందో చూడండి..  వీడియో వైరల్..
Woman Rescues King Cobra From A House
Krishna S
|

Updated on: Jul 16, 2026 | 4:18 PM

Share

ఎక్కడైన పాము కనిపిస్తే ఆమడదూరం పరిగెడతాం.. అదే పాము ఇంట్లో తిష్ఠ వేస్తే.. గుండెలు గుభేల్ అంటాయి. బీహార్‌లోని వాల్మీకినగర్ పరిధిలో ఉన్న మున్నీ లాల్ అనే వ్యక్తి ఇంట్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 10 అడుగుల భారీ కింగ్ కోబ్రా అతడి ఇంట్లోకి చొరబడింది. పామును చూసిన కుటుంబసభ్యులు భయంతో వణికిపోయారు. అది బుసలు కొడుతుంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. ఈ విషయం క్షణాల్లో చుట్టుపక్కల గ్రామస్తులకు తెలియడంతో మున్నీ లాల్ ఇంటి ముందు భారీగా జనం గుమికూడారు. కానీ ఆ భారీ విషసర్పం నుంచి ఆ కుటుంబానికి రక్షించడానికి ఆ ప్రాంత ప్రజలకు ఒకే ఒక్క పేరు గుర్తొచ్చింది.. ఆమే జానకి దేవి.

రెస్క్యూ ఆపరేషన్‌లో స్నేక్ లేడీ మార్క్..

ఆ ప్రాంతంలో స్నేక్ లేడీగా పేరుగాంచిన జానకి దేవి నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎన్నో ఏళ్ల అనుభవం, అపారమైన ధైర్యంతో ఆమె ఆ 10 అడుగుల కింగ్ కోబ్రాని చాకచక్యంగా పట్టుకున్నారు. అక్కడ ఉన్న జనాభాకు, ఆ పాముకు ఎలాంటి హాని కలగకుండా సురక్షితంగా దాన్ని బంధించారు. అనంతరం ఆ కింగ్ కోబ్రాని సమీపంలోని దట్టమైన అడవిలో విడిచిపెట్టారు.

12 ఏళ్ల వయసు నుంచే పాములతో స్నేహం..

జానకి దేవి 12 ఏళ్ల వయసు నుంచే పాములను పట్టుకోవడం ప్రారంభించారు. ఈ ప్రయాణంలో ఆమె ఎన్నో సార్లు విషసర్పాల కాట్లకు గురైనప్పటికీ, ఏనాడూ తన సేవలను ఆపలేదు. ఇప్పటివరకు ఆమె వేలాది విషసర్పాలను రక్షించి, అటవీ శాఖకు అప్పగించారు. ‘‘వర్షాకాలం, వాతావరణం మారే సమయంలో పాములు తమ సహజసిద్ధమైన నివాసాలను వదిలి, పొడిగా ఉండే సురక్షిత ప్రాంతాల కోసం జనావాసాల్లోకి వస్తుంటాయి. ముఖ్యంగా వాల్మీకి టైగర్ రిజర్వ్ పరిసర గ్రామాల్లో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రజలు ఎవరూ స్వయంగా పాములను పట్టుకోవడానికి ప్రయత్నించవద్దు వెంటనే అటవీ శాఖకు లేదా శిక్షణ పొందిన రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందించాలి’’ అని ఫారెస్ట్ రేంజర్ సత్యకుమార్ తెలిపారు.

ప్రమాదకరమైన కింగ్ కోబ్రా

ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషసర్పం కింగ్ కోబ్రా. దీని విషం నేరుగా మానవ నరాల వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇది కరిచినట్లయితే క్షణాల్లో ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది కాబట్టి అత్యవసరంగా వైద్య సహాయం అందించడం అత్యంత కీలకం. ఇలాంటి ప్రమాదకరమైన విషసర్పాల నుండి ప్రజల ప్రాణాలను, అలాగే మూగజీవాల ప్రాణాలను కాపాడుతున్న జానకి దేవి సాహసాన్ని స్థానికులతో పాటు అటవీ శాఖ అధికారులు సైతం అభినందిస్తున్నారు.

వీడియో చూడండి..

Follow Us
శుక్రవారం ఈ వస్తువులను ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీ దేవి నిలవదు!
శుక్రవారం ఈ వస్తువులను ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీ దేవి నిలవదు!
పండు మాస్టర్‌కు వీడియో కాల్ చేసి మాట్లాడిన యాంకర్ సుమ..
పండు మాస్టర్‌కు వీడియో కాల్ చేసి మాట్లాడిన యాంకర్ సుమ..
సోఫియా గార్డెన్స్‌లో భారత్ రికార్డు ఎలా ఉంది?
సోఫియా గార్డెన్స్‌లో భారత్ రికార్డు ఎలా ఉంది?
తాతగారి 24 ఏళ్ల నాటి SBI పాస్‌బుక్‌లో రూ.1 లక్ష బ్యాలెన్స్!
తాతగారి 24 ఏళ్ల నాటి SBI పాస్‌బుక్‌లో రూ.1 లక్ష బ్యాలెన్స్!
నా మీద 9 కోట్లు పెట్టి సినిమా తీస్తే మొత్తం పోతాయ్..జగపతి బాబు..
నా మీద 9 కోట్లు పెట్టి సినిమా తీస్తే మొత్తం పోతాయ్..జగపతి బాబు..
ఆ ఒక్క బ్యానర్ వల్ల అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టుకు భారీ షాక్?
ఆ ఒక్క బ్యానర్ వల్ల అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టుకు భారీ షాక్?
మీ పార్ట్‌నర్‌తో ఏకాంతంగా ఉన్నప్పుడు ఫోన్‌లో ఈ సెట్టింగ్స్..
మీ పార్ట్‌నర్‌తో ఏకాంతంగా ఉన్నప్పుడు ఫోన్‌లో ఈ సెట్టింగ్స్..
సూర్యోదయం ఫోటోను ఈ గదిలో పెడితే శుభం.. కానీ ఇక్కడ మాత్రం అస్సలు..
సూర్యోదయం ఫోటోను ఈ గదిలో పెడితే శుభం.. కానీ ఇక్కడ మాత్రం అస్సలు..
గురు మూఢమిలో ఆస్తిపాస్తులతో ఆ రాశుల వారు జాగ్రత్త!
గురు మూఢమిలో ఆస్తిపాస్తులతో ఆ రాశుల వారు జాగ్రత్త!
మనుషులు కాదు.. మృగాలు! బాలికపై ముగ్గురు ఆటో డైవర్ల పైశాచికం!
మనుషులు కాదు.. మృగాలు! బాలికపై ముగ్గురు ఆటో డైవర్ల పైశాచికం!