లచ్చిందేవి.. ఎప్పుడు.. ఎవరి తలుపు తడుతుందో అస్సలు ఊహించలేం. ఓ సామాన్య ఆటో డ్రైవర్ జీవితం రాత్రికి రాత్రే మారిపోయింది. కేవలం రూ. 39 పెట్టుబడితో ఏకంగా జాక్‌పాట్ కొట్టాడు. బీహార్‌కు చెందిన ఈ వ్యక్తికి అస్సలు బ్యాంక్ అకౌంటే లేదు.. కానీ కోటి వచ్చిపడింది. అదెలాగని అనుకుంటున్నారా.? అయితే ఈ స్టోరీ చదివేసేయండి.
వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌కు చెందిన నౌషాద్ అన్సారీ ఓ ఆటో డ్రైవర్. ఆటో నడిపితే తప్ప అన్సారీ కుటుంబం పూట గడుస్తుంది. అయితే రోజూ అటో నడిపితే నౌషాద్‌కు వచ్చేది కేవలం నాలుగు వందలు మాత్రమే. అప్పుడప్పుడూ ఈ డబ్బు కూడా వచ్చేది కాదు. ఇదిలా ఉంటే.. బుధవారం జరిగిన ఓ ఐపీఎల్ మ్యాచ్ ద్వారా నౌషాద్‌కు ఏకంగా రూ. కోటి వచ్చిపడింది.
ఈ మ్యాచ్‌కు అతడు రూ. 39తో ఓ ఆన్‌లైన్ యాప్‌లో టీం సెట్ చేశాడు. ఇందులో అతడికి అందరికంటే ఎక్కువ పాయింట్ల రావడంతో ఏకంగా రూ. కోటి గెలుచుకున్నాడు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే.. అతడికి అప్పటివరకు అస్సలు బ్యాంక్ అకౌంటే లేదు. ఆ డబ్బు గెలుచుకున్న తర్వాతనే ఖాతాను తెరిచాడు. అనంతరం యాప్ వాలెట్ నుంచి డబ్బును అకౌంట్‌కి బదిలీ చేయగా.. చివరికి ట్యాక్స్‌లు పోనూ.. రూ. 70 లక్షలు తనకొచ్చాయని నౌషాద్ చెప్పుకొచ్చాడు.