Viral Video: ఓరీ దేవుడో.. నడి రోడ్డుపై అడ్డంగా లేచి నిలబడ్డ భారీ విష సర్పం.. ఆ తర్వాత ఏం చేసిందో చూస్తే..

|

Aug 24, 2024 | 5:39 PM

ఈ వైరల్ వీడియో చూసిన నెటిజన్లు సైతం పెద్ద ఎత్తున తమ అభిప్రాయాలను తెలియజేశారు. బాబోయ్‌ నడిరోడ్డుపై ఇంత భారీ విష సర్పం ఎక్కడ్నుంచి వచ్చింది... నడిరోడ్డుపై ఎలా అడ్డంగా పిల్లర్‌లా నిలబడిందో చూసి కొందరు భయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు వాహనదారులకు

Viral Video: ఓరీ దేవుడో.. నడి రోడ్డుపై అడ్డంగా లేచి నిలబడ్డ భారీ విష సర్పం.. ఆ తర్వాత ఏం చేసిందో చూస్తే..
Cobra Standing
Follow us on

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇక్కడ మనుషులకే కాదు జంతువులు, పక్షులు, మొక్కలకు సంబంధించిన చాలా వీడియోలు మనకు కనిపిస్తాయి. అందులో కొన్ని మిమ్మల్ని నవ్విస్తాయి. మరికొన్ని ఏడిపిస్తాయి. ఇంకొన్ని వీడియోలు మనందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి వైరల్‌గా మారింది. సాధారణంగా పాములంటే అందరికీ భయం. పరిమాణంలో చిన్నదైనా, పెద్దదైనా అందరిలో భయం మాత్రం ఒక్కటే. అక్కడెక్కడో పాము ఉందని తెలిస్తే చాలు.. ఇక్కడ్నుంచే ప్రాణ భయంతో పరిగెడుతుంటాం. అలాంటిదే ఒక పాము వీడియో ఒకటి నెటిజన్లను హడలెత్తిస్తోంది.

ఇంటర్‌నెట్‌లో పాములకు సంబంధించిన వీడియోలు ఆసక్తికరంగా ఉంటాయి. అందుకే వీటికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూనే ఉంటాయి. తాజాగా వైరల్‌ అవుతున్న వీడియోలో నడిరోడ్డుపై ఒక పాము నిటారుగా నిలబడి కనిపించింది. రద్దీగా ఉన్న రోడ్డుపై మార్గ మధ్యలో ఉన్న డ్రైనేజీలోంచి బయటకు వచ్చిన పాము… నిటారుగా లేచి నిలబడి ఉంది. ఈ వీడియో చూసిన క్షణం మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నల్లటి రంగులో ఉన్న ఒక పాము అంత ఎత్తున రోడ్డుకు అడ్డంగా నిలిచి ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

ఈ వీడియోను యానిమల్‌సింతేనేచర్‌టుడే అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. అకస్మాత్తుగా డ్రెయిన్ నుంచి పాము బయటకు వచ్చింది. స్థంభంలా నిలబడి ఒక్కక్షణం రోడ్డువైపు చూసింది. ఆ తర్వాత అక్కడి నుంచి ముందుకు పరిగెత్తింది. ఈ భారీ విషసర్పం వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియో చూసిన నెటిజన్లు సైతం పెద్ద ఎత్తున తమ అభిప్రాయాలను తెలియజేశారు. బాబోయ్‌ నడిరోడ్డుపై ఇంత భారీ విష సర్పం ఎక్కడ్నుంచి వచ్చింది… డ్రైన్‌లోంచి ఉన్నట్టుండి బయటకు వచ్చిన పాము నడిరోడ్డుపై ఎలా అడ్డంగా పిల్లర్‌లా నిలబడిందో చూసి కొందరు భయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు వాహనదారులకు తప్పిన ముప్పుగా అభిర్ణిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..