
Best Trekking Places India: శీతాకాలం ముగిసి వసంత కాలం ప్రారంభమయ్యే సమయంలో ప్రకృతి సరికొత్త అందాలను సంతరించుకుంటుంది. మంచు కరుగుతూ, పచ్చని చెట్లు, రంగురంగుల పువ్వులతో కొండలు ఎంతో అందంగా కనిపిస్తాయి. ఈ వాతావరణం ట్రెక్కింగ్ (Trekking) చేయడానికి ఎంతో అనుకూలమైనది. భారతదేశంలో ప్రతి అడ్వెంచర్ లవర్ తన జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిన 7 ఉత్తమ స్ప్రింగ్ ట్రెక్స్ వివరాలు ఇవే:
దీనిని “భారతదేశపు స్విట్జర్లాండ్” అని కూడా పిలుస్తారు. వసంత కాలంలో ఇక్కడి బుగ్యాల్స్ (పచ్చికభూములు), రోడోడెండ్రాన్ ఎరుపు రంగు పువ్వులు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఈ ట్రెక్ ద్వారా మీరు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివాలయం ‘తుంగనాథ్’ ను కూడా సందర్శించవచ్చు. హిమాలయాల అందాలను చూడటానికి ఇది బెస్ట్ ప్లేస్.
ఉత్తరాఖండ్‌లోని అత్యంత అందమైన పచ్చికభూములలో దయారా బుగ్యాల్ ఒకటి. శీతాకాలంలో మంచుతో నిండిపోయే ఈ ప్రాంతం, వసంత కాలం వచ్చేసరికి పచ్చని కార్పెట్ పరిచినట్లు మారిపోతుంది. కొత్తగా ట్రెక్కింగ్ ప్రారంభించే వారికి (Beginners), కుటుంబంతో కలిసి వెళ్లే వారికి ఈ ట్రెక్ చాలా సులభంగా మరియు అనువుగా ఉంటుంది.
హిమాలయాలలోని నందాదేవి, ద్రోణగిరి, కామేట్ వంటి ప్రసిద్ధ శిఖరాల అద్భుతమైన వ్యూస్ ఈ ట్రెక్ ద్వారా కనిపిస్తాయి. దీనిని ‘లార్డ్ కర్జన్ ట్రెక్’ అని కూడా పిలుస్తారు. దట్టమైన అడవులు, మంచు కొండల గుండా సాగే ఈ ప్రయాణం అడ్వెంచర్ ప్రేమికులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది.
పురాణాల ప్రకారం స్వర్గానికి వెళ్లే మార్గంగా భావించే ఈ లోయ వసంత కాలంలో నందనవనంలా మారుతుంది. ఇక్కడి సాంప్రదాయ గ్రామాలు, పర్వతాల గుండా ప్రవహించే నదులు, అడవులు ట్రెక్కర్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. హిమాలయ సంస్కృతిని దగ్గరగా చూడాలనుకునే వారికి ఇది పర్‌ఫెక్ట్ ఛాయిస్.
సాధారణంగా దీనిని వింటర్ ట్రెక్ (శీతాకాలపు ట్రెక్) గా భావిస్తారు. కానీ వసంత కాలంలో కూడా దీని అందం అద్భుతంగా ఉంటుంది. కొండల మధ్యలో ఉండే బ్రహ్మతాల్ సరస్సు చుట్టూ ఉన్న ప్రకృతి దృశ్యాలు, రోడోడెండ్రాన్ పువ్వుల వనాలు ఈ ట్రెక్ ప్రత్యేకత.
ఈశాన్య భారతదేశంలో (North-East India) అత్యంత ప్రసిద్ధమైన ట్రెక్ ఇది. ప్రపంచంలోనే మూడవ అత్యంత ఎత్తైన శిఖరమైన ‘కంచన్‌జంగా’ (Kanchenjunga) ను చాలా దగ్గర నుండి చూసే అవకాశం ఈ ట్రెక్ ఇస్తుంది. ఏప్రిల్, మే నెలల్లో ఇక్కడి అడవుల్లో వికసించే రంగురంగుల పువ్వులు ఈ మార్గాన్ని ఒక కలల ప్రపంచంలా మారుస్తాయి. అయితే ఇది కొంచెం కష్టతరమైన ట్రెక్.
మీకు పువ్వులు, ప్రకృతి అంటే ఇష్టమైతే ఈ ట్రెక్ మీ కోసమే. వసంత కాలంలో ఇక్కడి బార్సే రోడోడెండ్రాన్ శాంచ్యురీ మొత్తం ఎరుపు, గులాబీ రంగు పువ్వులతో నిండిపోతుంది. ఎటు చూసినా వికసించిన పువ్వుల మధ్య నడవడం ఒక మరుపురాని అనుభూతిని ఇస్తుంది. అయితే వసంత కాలంలో (మార్చి నుండి మే వరకు) ఈ ప్రాంతాలకు వెళ్లడానికి ప్లాన్ చేసుకునేటప్పుడు, ముందే గైడ్‌లను బుక్ చేసుకోవడం, అవసరమైన ట్రావెల్ గేర్లను సిద్ధం చేసుకోవడం మంచిది.
ఇది కూడా చదవండి: Fish Cooking Tips: నోట్లో పెట్టుకుంటే కరిగిపోవలసిందే..! చేపల కూర ఇలా వండితే.. ముక్క మెత్తగా.. యమా రుచిగా..
ఇది కూడా చదవండి: Gold Purchases: బంగారం కొనుగోళ్లకు బ్రేక్.. మోదీ మాటపై ప్రజల షాకింగ్ నిర్ణయం.. సర్వేలో సంచలన విషయాలు..!