Viral: చెక్‌పోస్ట్ దగ్గర వాహన తనిఖీలు.. ఒక్కసారిగా దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ కారు.. సీన్ కట్ చేస్తే.!
ఓ చెక్‌పోస్ట్ దగ్గర సాధారణ వాహన తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఈలోపు ఎక్కడ నుంచి వచ్చిందో గానీ..
ఓ చెక్‌పోస్ట్ దగ్గర సాధారణ వాహన తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఈలోపు ఎక్కడ నుంచి వచ్చిందో గానీ.. ఓ కారు ఒక్కసారిగా దూసుకొచ్చింది. బారికేడ్‌లు పగలగొట్టి మరి వెళ్ళింది. వెంటనే అలెర్టయిన పోలీసులు.. ఆ కారును వెంబడించారు. సినిమాలో చేజింగ్ సీన్ మాదిరిగా.. సదరు కారులో ఉన్న వ్యక్తులు, పోలీసులమధ్య కాల్పులు జరిగాయి. కట్ చేస్తే.. కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఇంతకీ అసలు కథేంటంటే.?
వివరాల్లోకి వెళ్తే.. జూన్ 4వ తేదీన బెంగళూరులోని రామ్‌దేవ్ జ్యువెలర్స్ షోరూమ్‌లో చోరీ జరిగింది. నలుగురు నిందితులు షాప్ యజమానిని పిస్టల్‌తో బెదిరించి 3 కిలోల బంగారు ఆభరణాలు, 13 కిలోల వెండి ఆభరణాలను దోచుకెళ్ళారు. ఇవన్నీ సుమారు రూ. 2 కోట్లు విలువ చేస్తాయని సమాచారం. ఇక పరారీలో ఉన్న నిందితులను రాజస్థాన్‌లో చిత్తోర్‌గఢ్ పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారు. ఇన్ఫర్మర్ దగ్గర నుంచి వచ్చిన పక్కా సమాచారంతో నిందితుల కోసం ఓ చెక్‌పోస్ట్ దగ్గర గస్తీ కాసిన పోలీసులు.
సాధారణ వాహన తనిఖీలు చేస్తుండగా ఓ కారు దూసుకొచ్చి బారికేడ్లను పగలకొట్టి వెళ్ళిపోయింది. సుమారు 3 కిలో మీటర్లు దాన్ని వెంబడించగా.. సదరు కారు అదుపు తప్పి కాలువలో పడింది. స్థానికంగా ఉన్న పొలంలో పని చేస్తోన్న కూలీల సాయంతో కారులో చిక్కుకున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, వారి దగ్గర నుంచి దోచుకున్న బంగారు ఆభరణాలు, రెండు రివాల్వర్లను స్వాధీనం చేసుకున్నారు.