Viral Video: ఇది మాములు ఎలుగు బంటి కాదు.. కారెక్కెందుకు విన్యాసాలు.. చివరకు.. వీడియో వైరల్..

ఇటీవల సోషల్ మీడియాలో జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు, అల్లరి చేష్టలు తెగ వైరల్ అవుతున్నాయి.

Viral Video: ఇది మాములు ఎలుగు బంటి కాదు.. కారెక్కెందుకు విన్యాసాలు.. చివరకు.. వీడియో వైరల్..
Viral Video

Updated on: Sep 05, 2021 | 11:08 AM

ఇటీవల సోషల్ మీడియాలో జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు, అల్లరి చేష్టలు తెగ వైరల్ అవుతున్నాయి. భయంకరమైన వీడియోలతోపాటు… కొన్ని ముచ్చటగొలిపే వీడియో నెట్టింట్లో సందడి చేస్తుంటాయి. ఏనుగుల అల్లరి చేష్టలు, చిరుత పులుల వేట.. ఇలా ఎన్నో వీడియో చక్కర్లు కొడుతుంటాయి. ఇక అందులో ఆ జంతువుల వీడియోలను.. వాటి తెలివితేటలను చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. అయితే ఇప్పుడే సోషల్ మీడియాలో ఓ ఎలుగు బంటి వీడియో తెగ వైరల్ అవుతుంది. అందులో ఆ ఎలుగు బంటి చేస్తున్న పని చూస్తుంటే ఒకింత ఆశ్చర్యం కలగకమానదు. ఇంతకీ ఆ ఎలుగు బంటి కార్ ఎక్కడానికి పడే తాపత్రాయం.. ప్రయత్నాలు చూస్తుంటే ముచ్చటేస్తుంటుంది.

ఆ వీడియోలో ఓ ఎలుగుబంటి.. పార్కింగ్ చేసి ఉన్న కారు వద్దకు వచ్చి అందులోకి తొంగి చూస్తుంది. ఇక ఆ తర్వాత నెమ్మదిగా అందులోకి వెళ్లడానికి ప్రయత్నిస్తూ.. జంప్ చేస్తూ ఉంది. అలాగే చాలా సమయం వరకు ప్రయత్నించి .. చివరకు కార్ డోర్ ఓపెన్ చేయకుండానే అందులోకి జంప్ చేస్తుంది ఎలుగుబంటి. అనుకున్న పని పూర్తి కావాలంటే.. ఎంత కష్టమైన ప్రయత్నించాల్సిందే. సాధన చేస్తే ఫలితం ఉంటుందని.. ఈ ఎలుగుబంటి వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ వీడియోను ఎర్త్ ఫోకస్ అనే ఇన్‏స్టా యూజర్ షేర్ చేయగా.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఆ ఎలుగు బంటి చేష్టలను మీరు కూడా చూసేయ్యండి..

ఇన్‏స్టా పోస్ట్..

Also Read: Poonam Kaur: ‘అతను ఒక రాజకీయ నేరగాడు’… సంచలన ట్వీట్ చేసిన పూనమ్‌ కౌర్‌. ఇంతకా వ్యక్తి ఎవరు.?

Divi Vadthya: ‘ఈ కళ్లను చూస్తూ బతికేయొచ్చు’… కుర్రకారు మతి పోగొడుతోన్న అందాల దివి లేటెస్ట్‌ ఫొటోలు.

Bigg Boss 5 Telugu: అంతా సిద్ధం.. బుల్లితెరపై అసలైన వినోదం ఈరోజే.. టైమింగ్ గుర్తుందిగా ?