Video: గాల్లో విమానం.. ఎమర్జెన్సీ ఎగ్జిట్ తెరవాలని ప్రయాణికుడి లొల్లి! ఆ తర్వాత సీన్ ఇదే

విమానంలో ఓ ప్రయాణికుడు అత్యవసర ద్వారం తెరిచేందుకు ప్రయత్నించి అందరినీ హడలెత్తించాడు. కౌలాలంపూర్ నుంచి బయలుదేరిన ఫ్లైట్ లో ఈ ఘటన జరిగింది. పాలక్కాడ్‌కు చెందిన జంషీర్ అథనిక్కల్ ఎగ్జిట్ ప్యానెల్‌ను ధ్వంసం చేసి, తోటి ప్రయాణికులను బెదిరించాడు. దీంతో విమానంలో గందరగోళం నెలకొంది..

Video: గాల్లో విమానం.. ఎమర్జెన్సీ ఎగ్జిట్ తెరవాలని ప్రయాణికుడి లొల్లి! ఆ తర్వాత సీన్ ఇదే
Passenger Attempts To Open Batik Air Flight Emergency Door

Updated on: Aug 06, 2026 | 6:59 PM

కేరళలోని కొచ్చికి వెళ్తున్న బాటిక్ ఎయిర్ విమానంలో అత్యవసర ద్వారం (Emergency Exit) తెరిచేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విమాన భద్రతకు ముప్పు కలిగించేలా వ్యవహరించడంతో అతనిపై కేసు నమోదు చేశారు. అధికారుల వివరాల ప్రకారం.. నిందితుడిని కేరళలోని పాలక్కాడ్ జిల్లా కూటనాడ్‌కు చెందిన జంషీర్ అథనిక్కల్‌గా గుర్తించారు. అతను మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి కొచ్చికి బయలుదేరిన బాటిక్ ఎయిర్ ఫ్లైట్ OD231లో ప్రయాణిస్తున్నాడు.

బుధవారం రాత్రి 9:30 గంటల నుంచి 11:05 గంటల మధ్య విమానం గాల్లో ఉండగా ఈ ఘటన జరిగినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. జంషీర్ విమానం అత్యవసర ద్వారం తెరిచేందుకు ప్రయత్నించడంతో పాటు, ఎగ్జిట్ విండో ప్యానెల్‌ను ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో క్యాబిన్ సిబ్బంది, తోటి ప్రయాణికులు జంషీర్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ వీడియోల నిజానిజాలను స్వతంత్రంగా నిర్ధారించలేమని అధికారులు తెలిపారు. ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగించేలా వ్యవహరించడంతో పాటు, ఇతర ప్రయాణికులను బెదిరించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. కొచ్చి విమానాశ్రయంలో విమానం దిగిన అనంతరం సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని, తదుపరి చర్యల కోసం నెడుంబస్సేరి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.

ఇవి కూడా చదవండి

బాటిక్ ఎయిర్ భద్రతా అధికారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 351(3) కింద క్రిమినల్ బెదిరింపులు, ఎయిర్‌క్రాఫ్ట్ చట్టంలోని సెక్షన్ 11ఏ కింద భద్రతా నిబంధనల ఉల్లంఘన, కేరళ పోలీస్ చట్టంలోని సెక్షన్ 118(ఈ) కింద ప్రజా భద్రతకు ప్రమాదం కలిగించే చర్యలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us