Viral: రైతు పొలం దున్నుతుండగా బయటపడ్డ ప్లాస్టిక్ సంచి.. ఏముందా అని చెక్ చేయగా కళ్లు బైర్లు!

|

Jun 28, 2022 | 1:40 PM

ఓ వ్యక్తికి పొలం దున్నుతుండగా.. ప్లాస్టిక్ సంచి ఒకటి లభ్యమైంది. అందులో ఏముందా అని చెక్ చేయగా..

Viral: రైతు పొలం దున్నుతుండగా బయటపడ్డ ప్లాస్టిక్ సంచి.. ఏముందా అని చెక్ చేయగా కళ్లు బైర్లు!
Tractor Ploughing
Follow us on

ఇటీవల కాలంలో పొలం దున్నుతుండగా గుప్త నిధులు, లోహపు వస్తువులు లాంటివి ఎన్నో బయటపడుతున్న ఘటనలు అనేకం వెలుగులోకి వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా బీహార్‌లోని పాట్నాలో ఇలాంటి అరుదైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓ వ్యక్తికి పొలం దున్నుతుండగా.. ప్లాస్టిక్ సంచి ఒకటి లభ్యమైంది. అందులో ఏముందా అని చెక్ చేయగా.. అతడి ఫ్యూజులు ఎగిరిపోయాయి.

వివరాల్లోకి వెళ్తే.. స్థానిక సిగోడి పోలీస్ స్టేషన్ పరిధిలోని పసౌదా గ్రామం బాదర్ ప్రాంతానికి చెందిన అజయ్ సింగ్‌కి ఎకరం పొలం ఉంది. అతడు ఆ పొలాన్ని ట్రాక్టర్‌తో దున్నుతుండగా.. నాగలికి ప్లాస్టిక్ సంచి ఒకటి ఇరుక్కుంది. దాన్ని బయటికి తీసి అందులో ఏముందా అని చూడగా.. కుప్పలు తెప్పలుగా రూ. 500, రూ. 1000 పాత నోట్లు దర్శనమిచ్చాయి. ఈ విషయాన్ని గుట్టు చప్పుడు కాకుండా ఉంచాలనుకున్న.. ఆ నోటా.. ఈ నోటా పొలంలో డబ్బులు దొరికాయన్న విషయం కాస్తా గ్రామంలోని వారందరికీ, పోలీసులకు చేరింది.

ఇంకేముంది పోలీసులు అక్కడికి చేరుకునేసరికి గ్రామస్తులు దొరికిన నోట్లను దొరికినట్లుగా తీసుకెళ్లిపోయారు. క్షణాల్లో నోట్లన్నీ మాయమయ్యాయి. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. గ్రామస్తుల నుంచి నగదును రికవరీ చేసుకోవడంతో పాటు.. ఆ పాత నోట్లు అక్కడికి ఎలా వచ్చాయి.? ఎవరికి చెందినవి.? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి