Viral Video: అనుకోని ఆపదలో ఇరుకున్న పిల్ల ఏనుగు.. తల్లడిల్లిన ఆ తల్లి ఏనుగు ఏం చేసిందంటే..

ప్రపంచంలో వెలకట్టలేనిది అమ్మ ప్రేమ మాత్రమే.. పిల్లలపై తల్లి చూపించే ప్రేమకు ఏ కవి రాయలేని భావం ఉంది.. సముద్రాలు సైతం తలవంచేంత లోతు ఉంది.

Viral Video: అనుకోని ఆపదలో ఇరుకున్న పిల్ల ఏనుగు.. తల్లడిల్లిన ఆ తల్లి ఏనుగు ఏం చేసిందంటే..

Updated on: Oct 23, 2021 | 4:10 PM

Viral Video: ప్రపంచంలో వెలకట్టలేనిది అమ్మ ప్రేమ మాత్రమే.. పిల్లలపై తల్లి చూపించే ప్రేమకు ఏ కవి రాయలేని భావం ఉంది.. సముద్రాలు సైతం తలవంచేంత లోతు ఉంది. పిల్లలు ఆకలి అంటేనే తట్టుకోలేని తల్లి.. అదే ఆపద అంటే ఆగేనా.. పిల్లలకు ఏచిన్న గాయమైన తల్లడిల్లేది ముందుగా తల్లి మాత్రమే. అమ్మ ప్రేమకు సాక్ష్యంగా ఎన్నో వీడియోలు ఉన్నాయి. కేవలం మనుషుల్లోని కాదు జంతువుల్లోనూ అమ్మ ప్రేమ ఒకేలా ఉంటుంది. నిజానికి మనుషుల కంటే పిల్లలపై ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటాయి జంతువులు. ఇప్పుడు ఈ వీడియో కూడా అలాంటిదే.. పిల్ల ఏనుగు కోసం తల్లడిల్లిన తల్లి ఏనుగు వీడియో ఇది.

ఓ చిన్న ఏనుగు పిల్ల కాలు అనుకోకుండా ఓ టైర్ లో చిక్కుకుంది. పిల్లలు ఉయ్యాలాగా కట్టుకొని ఊగే టైరులో పిల్ల ఏనుగు కాలు ఇరుక్కుంది. అయితే దానిలోనుంచి కాలును ఎలా బయటకు తీయాలో తెలియక.. ఆ గున్న ఏనుగు నానా తిప్పలు పడింది. దాంతో అదిగమనించిన తల్లి ఏనుగు వెంటనే అక్కడికి చేరుకుంది. ఆ టైరు నుంచి పిల్ల ఏనుగు కాలును బయటకు తీయడానికి ప్రయత్నించింది. కానీ ఆ గున్న ఏనుగు మాత్రం భయంతో తన్నుకులాడింది. చివరకు ఎలాగో ఆ కాలు బయటకు వచ్చేసింది. తన పిల్లను ఇబ్బందిపెట్టిన ఆ టైరు పై కోపంతో ఆ తల్లి ఏనుగు టైరును తొండంతో విసిరికొట్టే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నెటిజన్లు ఈ వీడియో పై  రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అమ్మ ప్రేమ

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral News: దెయ్యంలా ప్రాంక్ చేయాలనుకుంది… ప్రాణాలే కోల్పోయింది..

Viral Video: అలెక్సాతో పిల్లాడి సంభాషణ…క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌కు నెటిజన్లు పిధా!

Viral Video: నీటిలో పాముల సయ్యాట… వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..