సోషల్ మీడియాలో జంతువుల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా వైల్డ్‌లైఫ్‌పై ఆసక్తి ఉన్నవారు ఎక్కువగా క్రూర మృగాల వేటకు సంబంధించిన వీడియోలు చూస్తుంటారు. చిరుత, సింహం, పులి లాంటి జంతువులు తమ ఎరను భయంకరంగా వేటాడతాయి. అడవిలో మనుగడ సాగించాలంటే వేటాడక తప్పదు. అయితే మీరెప్పుడైన కోతులు(Baboons) వేటాడటం చూశారా.? ఈ వీడియోలో ఓ చిరుతను కోతులు ఎలా వెంటాడుతున్నాయో చూస్తే మీరు ఆశ్చర్యపోతారంటే.!
కొండలాంటి ప్రదేశంలో ఓ చిరుతను కోతుల(Baboons) మంద వెంటాడుతున్నట్లు మీరు వీడియోలో చూడవచ్చు. అవి ఎందుకు చిరుతను వేటాడుతున్నాయో తెలియదు. కానీ చిరుత నోట ఎర ఉన్నట్లు కనిపిస్తుంది. బహుశా చిరుత నోటకరిచిన జంతువును కాపాడుకునేందుకు కోతులు(Baboons) దానిని వెంటపడుతున్నాయి. కొన్నిసార్లు బలవంతుడికి కూడా అనుకోని పరిస్థితులు ఏర్పడవచ్చు అంటే ఇదేనేమో.! ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.
కాగా, ఈ వీడియోను ‘ChekaPhotoSafaris’ అనే పేజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీనిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వరుసపెట్టి లైకులు, కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘చిరుత.. కోతిపిల్లను ఎరగా చేసుకుని ఉండొచ్చునని” ఒకరు కామెంట్ చేయగా.. ‘వైల్డ్‌లైఫ్‌లో ఇదంతా సహజం’ అని మరొకరు కామెంట్ చేశారు.
Read Also: కివి పండ్లను వీరు అస్సలు తినకూడదు.. తింటే ఎలా పరిస్థితులు ఎదురవుతాయంటే..
ఈ ఫోటోలో సింహం ఎక్కడుందో కనిపెట్టండి.! కళ్లకు పని చెప్పండి.. గుర్తించండి!